Road Tax Hike : త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ వాహనాల ధరలు మరింత పెరగనున్నాయి. ఎందుకంటే ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లపై రాష్ట్ర ప్రభుత్వం విధించే రోడ్ ట్యాక్స్‌ను పెంచనున్నారు. రూ.లక్ష కంటే ఎక్కువ ధర ఉన్న ద్విచక్ర వాహనాలు, రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లకు రోడ్ ట్యాక్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఈ దిశగా నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు సన్నద్ధం అవుతోంది. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలకు 2 రకాల రోడ్ ట్యాక్స్ శ్లాబులు, ఫోర్ వీలర్లకు 4 రకాల రోడ్ ట్యాక్స్ శ్లాబులు ఉన్నాయి. ఈ శ్లాబుల సంఖ్యను తగ్గించాలని తెలంగాణ రవాణాశాఖ యోచిస్తోంది. ఒకవేళ రోడ్ ట్యాక్స్ పెరిగితే.. వాహన రిజిస్ట్రేషన్ ఛార్జీలు(Road Tax Hike) కూడా పెరిగిపోతాయి.
Also Read :Naga Chaitanya : నా జీవితంలో ఏర్పడిన ఖాళీని తను నింపుతుంది.. శోభితతో పెళ్లిపై నాగచైతన్య..
కేరళ, తమిళనాడు రేంజులో..
వాహనాలపై విధిస్తున్న రోడ్ ట్యాక్ ద్వారా ఇతర రాష్ట్రాలకు వస్తున్న ఆదాయంపై ఇటీవలే తెలంగాణ రవాణాశాఖ అధికారులు అధ్యయనం చేశారు. రోడ్ ట్యాక్స్ గరిష్ఠంగా కేరళలో 21 శాతం, తమిళనాడులో 20 శాతం దాకా ఉందని గుర్తించారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.50 వేల లోపు వాహనాలపై 9 శాతం, రూ.50వేల నుంచి రూ.5 లక్షలలోపు ధర ఉండే వాహనాలపై 12 శాతం దాకా రోడ్ ట్యాక్స్ విధిస్తున్నారు. రూ.5 లక్షలలోపు ధర పలికే వాహనాలకు 13 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలలోపు ధర పలికే వాహనాలకు 14 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ధర పలికే వాహనాలకు 17 శాతం, రూ.20 లక్షలపైచిలుకు ధర పలికే వాహనాలపై 18 శాతం మేర రోడ్ ట్యాక్స్ విధిస్తున్నారు.
Also Read :Pushpa 2 Song : పుష్ప 2 ఐటెం సాంగ్ చూశారా..? శ్రీలీల అదరగొట్టేసిందిగా..
రోడ్ ట్యాక్స్ ఆదాయాన్ని డబుల్ చేసేందుకు..
చివరిసారిగా తెలంగాణలో 2022లో రోడ్ ట్యాక్స్‌ను పెంచారు. అప్పట్లో రోడ్ ట్యాక్స్ శ్లాబుల్లో మార్పులు చేర్పులు చేశారు. ఈసారి కూడా మళ్లీ మార్పులు జరగబోతున్నాయి. అయితే కేరళ, తమిళనాడుల్లో అమలవుతున్న రేంజులోనే తెలంగాణలోనూ రోడ్ ట్యాక్స్ శ్లాబులు ఇకపై ఉంటాయని తెలుస్తోంది. 2021-22లో తెలంగాణకు రోడ్ ట్యాక్స్ ద్వారా రూ.3,971.39 కోట్ల ఆదాయం వచ్చింది. దాన్ని 2022లో పెంచడంతో ఏకంగా రూ.6,390.80 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి మళ్లీ పెంచితే ఈ ఆదాయం డబుల్ అయ్యే అవకాశం ఉంది.