బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుసగా రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇటీవలే బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) బీఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించారు. అయితే.. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరుకు చెందిన కొందరు కౌన్సిలర్లు సైతం బీఆర్‌ఎస్ పార్టీని వీడారు.
We’re now on WhatsApp. Click to Join.
సొంత పార్టీ పాలవకర్గం అధికారంలో ఉన్నా కూడా నిధులు మంజూరు చేయడంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, నమ్మ గెలిపించిన ప్రజలకు కనీస అభివృద్ధి చేయలేకపోతున్నామని మండిపడుతూ బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్‌లు. వివరాల్లోకి వెళితే.. పటాన్‌చెరులోని బొల్లారం మున్సిపాలటీ పాలకవర్గం బీఆర్‌ఎస్‌కు చెందిందే అయినా.. అందులో కొందరు బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌లపై పాలకవర్గం పెద్ద శీతకన్ను వేశారు. దీంతో సోమవారం నిర్వహించిన మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సొంత పార్టీపై అవిశ్వాన్ని వెల్లగక్కారు. సదరు కౌన్సిలర్లు బొల్లారం మున్సిపాలిటీని పాలకవర్గం పెద్దలు బ్రష్టుపట్టించారని ఆరోపిస్తూ, మున్సిపల్ చైర్మన్ రోజా బాల్ రెడ్డి, కమిషనర్ సంగారెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా.. నిరసన తెలుపుతూ సర్వసభ్య సమావేశాన్ని బైకాట్ చేశారు. గత సంవత్సర కాలంగా మున్సిపాలిటీలో అభివృద్ధి అడ్డుకుంటున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పాలకవర్గం ఉన్న బొల్లారం మున్సిపాలిటీలో అభివృద్ధి పడకేసిందని ఆయన విమర్శించారు. ఎక్కడ చూసినా రోడ్లు గుంతలగా దర్శనమిస్తున్నాయని, రోడ్ల పై పారుతున్న డ్రైనేజీల కంపుతో పాదచారులకు, వాహనదారులకే కాకుండా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయాన్ని చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకువచ్చిన పట్టించుకోవడం లేదన్నారు.
గత సంవత్సర కాలంగా సొంత పార్టీ కౌన్సిలర్ల పై కూడా పక్షపాతం చూపుతూ అభివృద్ధి నిధులివ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆదరించి బీఆర్ ఎస్ పార్టీ కి మున్సిపాలిటీ లో అవకాశం కల్పిస్తే నిధులు ఇవ్వకుండా ప్రజలని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించిన చంద్రారెడ్డి తో పాటు కౌన్సిలర్లు సంతోషి, గోపాలమ్మ, నిహారిక, చంద్రయ్య, సంధ్య, జయమ్మలు రేపు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.
Read Also : Ambati Rambabu : జగన్ సక్సెస్ ఫుల్ సీఎం..చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం..