మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

Beer Bottle Fish  హైదరాబాద్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన బీర్ బాటిల్‌లో ఏకంగా ఓ చేప పిల్ల సజీవంగా ఈదుతూ కనిపించడం కలకలం రేపింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్‌లోని జేపీ వైన్ షాపులో నిన్న‌ ఓ కస్టమర్ కింగ్‌ఫిషర్ లైట్ బీర్ కొనుగోలు చేశాడు. దానిని తాగేందుకు మూత తీయగా, అందులో చిన్న చేప పిల్ల కదులుతూ కనిపించింది. […]

Published By: HashtagU Telugu Desk
Fish In Beer Bottle

Fish In Beer Bottle

Beer Bottle Fish  హైదరాబాద్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన బీర్ బాటిల్‌లో ఏకంగా ఓ చేప పిల్ల సజీవంగా ఈదుతూ కనిపించడం కలకలం రేపింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్‌లోని జేపీ వైన్ షాపులో నిన్న‌ ఓ కస్టమర్ కింగ్‌ఫిషర్ లైట్ బీర్ కొనుగోలు చేశాడు. దానిని తాగేందుకు మూత తీయగా, అందులో చిన్న చేప పిల్ల కదులుతూ కనిపించింది. ఊహించని ఈ పరిణామంతో అవాక్కైన అతను, వెంటనే వైన్ షాపు నిర్వాహకుడిని సంప్రదించి విషయం చెప్పాడు.

అయితే, షాపు సిబ్బంది బాధ్యతాయుతంగా స్పందించకపోగా, కస్టమర్‌తో దురుసుగా ప్రవర్తించారు. బీర్లను తాము తయారు చేయమని, ఏమైనా ఉంటే నేరుగా కంపెనీని అడగాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. వారి తీరుతో అసహనానికి గురైన ఆ కస్టమర్, బీర్ బాటిల్‌లో చేప కదులుతున్న దృశ్యాలను తన ఫోన్‌లో వీడియో తీశారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

  Last Updated: 07 Mar 2026, 10:36 AM IST