Site icon HashtagU Telugu

B. Shivadhar Reddy : తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డికి ఛాన్స్..?

B. Shivadhar Reddy Tg Dg

B. Shivadhar Reddy Tg Dg

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు శాఖల్లో అనేక మంది అధికారులను మారుస్తూ వస్తుంది. ముఖ్యంగా IAS , IPS లను పెద్ద ఎత్తున మార్చడం జరిగింది. తాజాగా కొత్తగా DGP నియామకం చేయబోతున్నట్లు తెలుస్తుంది. సామాజిక న్యాయంతో పాటుగా సిన్సియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ సీఎం రేవంత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఐపీఎస్ ల బదిలీల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి మరో రెండు డీజీ ర్యాంకులు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో రవి గుప్తా, అంజనీ కుమార్, సివి ఆనంద్, జితేందర్లు డీజి హోదాలో ఉన్నారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ ఇటీవలే మరణించారు. సందీప్ శాండిల్య పదవి విరమణ పొందారు. జితేందర్ కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యతలను అప్పగించారు. అంజనీ కుమార్ ను రోడ్డు సేఫ్టీ బిజీగా పరిమితం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో డీజీ హోదాలో చోటుచేసుకున్న మార్పులతో 1994 బ్యాచ్ ఐపీఎస్ లో ఇద్దరిలో ఒకరికి డీజీ ర్యాంక్ దక్కే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.1994 బ్యాచ్ కు చెందిన అదనపు డీజీలు శివధర్ రెడ్డి, శిఖ గోయల్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, వినాయక ప్రభాకర్ ఆప్టేలలో ఇద్దరికీ డీజే రాంక్ దక్కనుంది. వీరిలో ఆప్టే కేంద్ర సర్వీస్ లో ఉన్నారు. దీంతో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డిలకు డీజే ర్యాంక్ దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ సమీకరణలతో ప్రస్తుతం ఐబీ చీప్ గా ఉన్న శివధర్ రెడ్డికి రాష్ట్ర డిజిపిగా, ఎస్ బీ చీఫ్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఎంపిక లాంఛన ప్రాయమేనని పోలీస్ ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ జరుగుతుంది.

బి. శివధర్ రెడ్డి 1994-బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి, రంగారెడ్డి జిల్లాకు చెందిన… శివధర్ రెడ్డి ఎల్‌ఎల్‌బి చదివారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి. బి. శివధర్ రెడ్డి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, 1993లో టాపర్‌లలో ఒకరు. ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఇంతకు ముందు, బి. శివధర్ రెడ్డి జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో వివిధ స్థానాల్లో ఉన్నారు. తన సర్వీసు తొలినాళ్లలో ఏఎస్పీగా పనిచేసి, ఆ తర్వాత నల్గొండ, శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరు వంటి పలు జిల్లాలకు పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. డిఐజిగా పలు ఉన్నత స్థానాల్లో పనిచేశారు.

ఏపీ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌గా , వైజాగ్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అనూహ్యంగా పోలీసు సేవలందించినందుకుగానూ రెండుసార్లు ‘రాష్ట్రపతి పతకం’ అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంపికైన మొట్టమొదటి అఖిల భారత సర్వీసు అధికారులలో ఒకరైన బి. శివధర్ రెడ్డి, IPS, తెలంగాణ రాష్ట్ర పోలీసింగ్‌ను సంస్కరించడంలో మరియు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ‘ఫ్రెండ్లీ అండ్ ఫర్మిడబుల్ పోలీసింగ్’ అనే భావనను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు.

Read Also : CM Revanth Reddy: కొత్తగా ఎంపికైన మంత్రులకు రేవంత్ విజ్ఞప్తి

Exit mobile version