D.K.Shivakumar : కేసీఆర్ ను పూర్తిగా ఫామ్ హౌస్‌కు పంపిద్దాం – డీకే శివకుమార్

తెలంగాణ ప్రజలంతా మార్పు కోసం ఎదురుచూస్తోందని శివకుమార్ అన్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ రుణం తీర్పుకునేందుకు ఎదురుచూస్తున్నారన్నారు

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 09:07 PM IST

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ (Congress) మరింత దూకుడు పెంచింది. ఈరోజుతో నామినేషన్ల పర్వం కూడా పూర్తికావడం తో ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని స్పీడ్ చేస్తూ..అధికార పార్టీ (BRS) ఫై మరింత దూకుడు పెంచేలా ప్లాన్ చేస్తున్నారు. లోకల్ నేతలే కాకుండా జాతీయ నేతలు సైతం రంగంలోకి దిగి అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నారు.

ఈరోజు కోదాడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (D.K.Shivakumar) పాల్గొని బిఆర్ఎస్ సర్కార్ ఫై , కేసీఆర్ (KCR) ఫై పలు విమర్శలు చేసారు. కేసీఆర్ సెక్రటేరియట్ రాలేదు… ఇప్పుడు ఫామ్ హౌస్‌కు పంపిద్దాం. బై బై కేసీఆర్ అంటూ కామెంట్స్ చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య దోస్తులు… హైదరాబాద్ వచ్చి విమర్శలు చేస్తారని శివ కుమార్ అన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మెడిగడ్డ ప్రాజెక్టులు కూలిపోతున్నాయి దీనిని బట్టి కేసీఆర్ ఎంత నాణ్యత తో కట్టారో అర్ధం అవుతుందన్నారు. ఈసారి కోదాడలో పద్మావతి 25 వేల మెజార్టీతో గెలుస్తుంది. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అని ధీమా వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ ప్రజలంతా మార్పు కోసం ఎదురుచూస్తోందని శివకుమార్ అన్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ రుణం తీర్పుకునేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి అధికారం ఇవ్వాలని జనం ఆలోచిస్తున్నారన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్ కు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని, వారికి శాశ్వత విశ్రాంతి ఇవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

Read Also : Revanth Reddy : కేసీఆర్ కామారెడ్డి లో గెలిస్తే.. భూములన్నీ దోచేస్తాడు – రేవంత్