Site icon HashtagU Telugu

Foxconn Letter: ఫాక్స్‌కాన్‌ నకిలీ లేఖపై డీకే క్లారిటీ

Foxconn Letter

Foxconn Letter

Foxconn Letter: యాపిల్‌ ఎయిర్‌పాడ్‌ తయారీ ప్లాంట్‌ను హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్‌కాన్‌ గ్రూప్‌నకు లేఖ రాశానన్న వాదనను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తోసిపుచ్చారు. యాపిల్ ఎయిర్‌పాడ్ తయారీ ప్లాంట్‌ను హైదరాబాద్ నుండి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్‌కాన్ గ్రూపులకు నేను లేఖ రాశాను అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లేఖ నకిలీదని, దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని క్లారిటీ ఇచ్చారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. .

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఆపిల్ ఎయిర్‌పాడ్స్ పరిశ్రమను బెంగళూరుకు తరలించాలని ప్రతిపాదిస్తున్నట్టు, బెంగళూరులో ఉండటం వల్ల అంతర్జాతీయ గుర్తింపు పెరుగుతుందని ఓ లెటర్ వైరల్ గా మారింది. తెలంగాణలో త్వరలో స్నేహపూర్వక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని, అక్కడ మీకు ఎలాంటి ఆటంకాలు ఉండవని హామీ ఇస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

ఫాక్స్‌కాన్‌ను బెంగ‌ళూరుకు త‌ర‌లించేందుకు కాంగ్రెస్ భారీ కుట్ర‌ చేస్తున్నదని ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ డీకే శివ‌కుమార్‌పై మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఫాక్స్‌కాన్ కంపెనీ చైనాలో 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే సదరు సంస్థను బెంగుళూరుకు తరలించే క్రమంలో డీకే శివకుమార్ అక్టోబర్ 25వ తేదీన కంపెనీకి లేఖ రాశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు అని కేటీఆర్ అన్నారు.

Also Read: YCP vs BJP : విజ‌య‌సాయిరెడ్డిపై సుప్రీం చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వ‌రి

Exit mobile version