CM KCR: కేసిఆర్ తో మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ రాజె భేటీ!

మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, సాహూ మహారాజ్ మనవడు, కొల్హాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె (Sambhajiraje)  ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR)తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఛత్రపతి శంభాజీ రాజెను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో సీఎం వారికి ఘనంగా ఆహ్వానం పలికారు.

Published By: HashtagU Telugu Desk
CM KCR

Kcr

మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, సాహూ మహారాజ్ మనవడు, కొల్హాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె (Sambhajiraje)  ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR)తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఛత్రపతి శంభాజీ రాజెను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో సీఎం వారికి ఘనంగా ఆహ్వానం పలికారు. మధ్యాహ్నం భోజనంతో వారికి ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం సీఎంతో సుధీర్ఘంగా పలు అంశాల మీద లోతైన చర్చలు జరిగాయి.

దేశానికే ఆదర్శంగా, తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఆయన ఆరా తీసారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సహా అన్ని వర్గాల ప్రజలకు ఇంత గొప్పగా సంక్షేమాన్ని అందిచడంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలపై ఛత్రపతి శంభాజీ రాజె ఆసక్తిని కనబరిచారు.

Also Read: Pakistan Flag: ఇంటి మీద పాక్ జెండా.. గణతంత్ర దినోత్సవం రోజు షాకింగ్ ఘటన!

తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తే బాగుంటుందని శంభాజీ రాజె తన ఆకాంక్షను వెల్లడించారు. అద్భుతమైన తెలంగాణ ప్రగతి నమూనా ఇక్కడికే పరిమితం కాకుండా మహారాష్ట్ర సహా మిగిలిన అన్ని రాష్ట్రాలకు, దేశ వ్యాప్తంగా విస్తరించాల్సి వుందని రాజె అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంశాలు, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘ చర్చ సాగింది. దేశ ప్రజల అభ్యున్నతికి, దేశ సమగ్రతకు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వినూత్న ఎజెండా ప్రజలముందుకు రావాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. అవసరమైతే మళ్లీ ఒకసారి కలుసుకుని అన్ని అంశాలపై చర్చిద్దామని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఛత్రపతి శంభాజీ రాజ్ పూర్వీకులు శివాజీ మహారాజ్ నుంచి సాహూ మహారాజ్ దాకా ఈ దేశానికి వారందించిన సేవలను ఇరువురు స్మరించుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారందంచిన పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని సీఎం అభిప్రాయపడ్డారు. వారి స్ఫూర్తితోనే, కుల, మత వివక్షకు తావు లేకుండా తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా జరిగిన చర్చలో సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘రాజర్షి సాహు ఛత్రపతి’ పుస్తకాన్ని సీఎంకు ఛత్రపతి శంభాజీ రాజె అందించారు.

  Last Updated: 27 Jan 2023, 11:45 AM IST