Sheeps Distribution Scam : రూ.700 కోట్లు ఏమయ్యాయ్ ? గొర్రెల పంపిణీ స్కాంపై ఈడీ ఫోకస్

బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీంలో స్కాం జరిగిందనే ఆరోపణలపై  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు మొదలైంది.

Published By: HashtagU Telugu Desk
Sheeps Distribution Scam

Sheeps Distribution Scam

Sheeps Distribution Scam : బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీంలో స్కాం జరిగిందనే ఆరోపణలపై  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు మొదలైంది. ఈ స్కీంకు సంబంధించిన దాదాపు రూ.700 కోట్లు దారిమళ్లాయని ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో ఆ అంశంపై ఈడీ ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో ఇప్పటివరకు ఏసీబీ 10 మంది నిందితుల్ని గుర్తించి, 8 మంది పశుసంవర్ధకశాఖ అధికారులను అరెస్టు చేసింది. దారి మళ్లిన సొమ్ములో 10 మంది నిందితులు వాటాదారులు మాత్రమేనని.. మిగిలిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందనే విషయాన్ని తేల్చడంపైనే ఈడీ ఫోకస్  చేయనుంది. గొర్రెల కొనుగోలుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ము ఎవరి అకౌంట్లలోకి వెళ్లిందనే సమాచారాన్ని  సేకరించే పనిలో ఈడీ నిమగ్నమైంది.ఈడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

  • గొర్రెల పంపిణీ పథకం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు విడతల్లో  దాదాపు రూ.11 వేల కోట్ల నిధుల్ని కేటాయించింది. ఆ డబ్బు ఎవరి అకౌంట్లలోకి వెళ్లిందనే విషయాన్ని ఈడీ ఆరా తీస్తోంది.
  • ఈ స్కీంలో అనధికార ఏజెంట్లుగా వ్యవహరించిన మొహిదుద్దీన్‌ లాంటి దళారులు తమ బినామీల ఖాతాల్లోకి ఈ డబ్బును బదిలీ చేయించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది.
  • కీలక నిందితులుగా ఉన్న మొహిదుద్దీన్, అతడి తనయుడు ఇక్రమ్‌ ప్రస్తుతం విదేశాల్లో మకాం వేశారు. వారిపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి.

Also Read :New Registration Charges : ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు.. కసరత్తు షురూ

  • మొహిదుద్దీన్‌లాంటి మరికొందరు దళారులను గుర్తించడంపై ఈడీ ఫోకస్ చేసింది.
  • గత ప్రభుత్వంలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా వ్యవహరించిన కల్యాణ్‌ను ఏసీబీ ఇప్పటికే అరెస్టు చేసింది.
  • మొహిదుద్దీన్‌ బినామీ అకౌంట్లతో సొమ్ము(Sheeps Distribution Scam) కొట్టేసి.. దాన్ని కల్యాణ్‌ ద్వారా సూత్రధారులకు చేర్చారని అంటున్నారు.
  • ఈడీ దర్యాప్తులో మొహిదుద్దీన్‌, కల్యాణ్‌ వాంగ్మూలాలు కీలకం కానున్నాయి. వీరిద్దరిని ఏసీబీ ఇప్పటికే విచారించింది.

Also Read : Popular Father Characters : ‘ఆ నలుగురు’.. తండ్రి పాత్రల్లో వారికి వారే సాటి!

  Last Updated: 16 Jun 2024, 09:35 AM IST