Munugode Effect: మునుగోడు ఎఫెక్ట్‌.. నగదు బదిలీగా గొర్రెల పంపిణీ ప‌థకం..!

గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 వేల యూనిట్లు, నల్గొండ జిల్లాలో 5 వేల 600 యూనిట్లకు ఇది వర్తించనుంది. ఈ మేరకు మొత్తం 7 వేల 600 మంది లబ్దిదారులకు సంబంధించిన

  • Written By:
  • Updated On - October 5, 2022 / 08:39 PM IST

Munugode Effect: గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 వేల యూనిట్లు, నల్గొండ జిల్లాలో 5 వేల 600 యూనిట్లకు ఇది వర్తించనుంది. ఈ మేరకు మొత్తం 7 వేల 600 మంది లబ్దిదారులకు సంబంధించిన 93 కోట్ల 76 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ ఖాతాలో వేసింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక కోసమే రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ స్కీంను నగదు బదిలీకి మార్చిందని విమర్శలు వస్తున్నాయి. అందుకే కేవలం 2 జిల్లాలకు మాత్రమే వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల కొనుగోళ్లకు సమయం పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ జాప్యాన్ని నివారించడానికి, గొల్ల/కురుమ సంఘం సభ్యులు సొంతంగా గొర్రెలను కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రత్యక్ష నగదు ప్రయోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు పేర్కొన్నారు.

గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, ఒక పొట్టేలును రూ.1.75 లక్షలతో పంపిణీ చేస్తుంది. ఇందులో లబ్ధిదారుడు 25 శాతం లేదా రూ.43,750 జమ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రూ.1,31,250 జమ చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే వాటా రూ. 1,31,250 నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసింది. మునుగోడు ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకునే అధికారులు ఈ ప్రాంతంలో ఈ మార్పు తీసుకొచ్చార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక మునుగోడు ఉప ఎన్నిక‌కు న‌వంబ‌ర్ 3వ తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 7వ తేదీన నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 14. నామినేష‌న్లను 15వ తేదీన ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 17. న‌వంబ‌ర్ 3వ తేదీన ఎన్నికలు నిర్వహించి, 6న ఫ‌లితాల‌ను వెల్లడించ‌నున్నారు.