Site icon HashtagU Telugu

She Shuttle Bus: హైదరాబాద్ లో మొదలైన షీ షటిల్ బస్సు సర్వీస్.. మహిళలకు ఉచిత ప్రయాణం

She Shuttle Bus Service Started In Hyderabad.. Free Travel For Women

She Shuttle Bus Service Started In Hyderabad.. Free Travel For Women

సిటీలో మహిళల భద్రత కోసం రెండు షీ షటిల్ (She Shuttle) సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. శుక్రవారం రాయదుర్గం జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డుల కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ షీ షటిల్ (She Shuttle) బస్సును తయారుచేశారని తెలిపారు. మహిళలకు అన్ని సౌకర్యాలు ఉండేటట్లు ఏర్పాటు చేశారని వివరించారు. భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు కూడా ఉంటారని నిర్వాహకులు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ ముఖ్య అతిధి కాగా, సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read:  Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ చాలించి.. ఇక ఆఫీసుకు రండి.. ఉద్యోగులకు ప్రముఖ కంపెనీల ఆర్డర్