Site icon HashtagU Telugu

YSRTP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గా షర్మిల..?

YS Sharmila meeting with Congress DK Shivakumar and Congress new plan for ap

YS Sharmila meeting with Congress DK Shivakumar and Congress new plan for ap

పాపం వైస్ షర్మిల (YS Sharmila)..ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఆమె ఏది అనుకున్న ఏది జరగడం లేదు. తెలంగాణ లో సొంతగా పార్టీ (YSR Telangana Party) పెట్టి సంచలనం సృష్టిద్దామని ఎన్నెన్నో కలలు కన్నంది..కానీ అవన్నీ కలగానే మిగిలిపోయాయి. ఎన్ని ధర్నాలు చేసిన , ఎన్ని దీక్షలు చేసిన కనీసం పట్టించుకునే నాధుడు లేకపోవడం తో..పార్టీ ని నడపడం కంటే కాంగ్రెస్ లో కలపడమే బెటర్ అనుకుంది. ఆ మేరకు కాంగ్రెస్ పెద్దలు రాహుల్ , సోనియా, శివకుమార్ లతో వరుస సమావేశాలు జరిపి YSRTP ని కాంగ్రెస్ లో విలీనం (YSRTP Merge with Congress) చేసేందుకు నిర్ణయం ఇచ్చుకుంది. కానీ కొన్ని కండీషనలు పెట్టేసరికి కాంగ్రెస్ అధిష్టానం పక్కకు పెట్టింది. ఆ తర్వాత కండిషన్లు వద్దు ఏమి వద్దు..మీ పార్టీ లో కలుపుకుంటున్నామని ప్రకటన చెయ్యండి అని కోరింది…కానీ దానికి కూడా కాంగ్రెస్ పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోయేసరికి..ఇక చేసేదేం లేక 2023 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం 119 స్థానాలకు అభ్యర్థులను ఖ‌రారు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 9వ తేదీ నుంచి అన్ని నియోజవర్గాల్లోని ఆశావాహుల నుంచి వైఎస్సార్‌టీపీ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో వైఎస్సార్‌టీపీ వర్గాలు బిజీగా ఉన్నాయి. మరి షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొదటి నుండి కూడా ఆమె పాలేరు నుండి పోటీ చేస్తానని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుండి తుమ్మల , బిఆర్ఎస్ నుండి ఉపేందర్ బరిలోకి దిగనున్నారు. వారిద్దరి నడుమ షర్మిల తట్టుకోగలదా..? అనేది ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న.

Read Also : Pawan Kalyan : పేనుకు పెత్తనం ఇచ్చినట్లు పవన్ కు ‘టీడీపీ’ పెత్తనం – తమ్మారెడ్డి భరద్వాజ్