Sharmila strategy : BRS, కాంగ్రెస్ పొత్తుపై ష‌ర్మిల‌, KCR కు ద‌శ‌ ప్ర‌శ్న‌లు!

కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ వైఎస్సాఆర్ పార్టీ విలీనం కాబోతుందా? ష‌ర్మిల(Sharmila strategy) కాంగ్రెస్ త‌ర‌పున కీల‌కం కానుందా?

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 05:30 PM IST

కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ వైఎస్సాఆర్ పార్టీ విలీనం కాబోతుందా? ష‌ర్మిల(Sharmila strategy) తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ త‌ర‌పున కీల‌కం కానుందా? ఇలాంటి ప్ర‌శ్న‌లు గ‌త వారం రోజులుగా రాజ‌కీయవ‌ర్గాల‌ను వేధించాయి. వాటికి స‌మాధానం చెబుతూ విలీనం ప్ర‌స‌క్తేలేద‌ని తేల్చేశారు ష‌ర్మిల‌. అయితే, పొత్తుకు(Alliance) మాత్రం అవ‌కాశం ఉంటుంద‌నే సంకేతాలు ఇస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల‌ను ఇరికించేశారు. ఎన్నిక‌ల‌కు వెళ్లే ముందు పొత్తు గురించి ఆ రెండు పార్టీలు ప్ర‌జ‌ల‌కు క్లారిటీ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటున్నాయ‌ని సంకేతాలు ఇచ్చారు. ఎన్నిక‌ల‌కు ముందు, త‌రువాత పొత్తు ఉండ‌ద‌ని ఆ రెండు పార్టీలు చెప్ప‌గ‌ల‌వా? అంటూ నిల‌దీశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటున్నాయ‌ని సంకేతాలు (Sharmila stratagy)

క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ను క‌లిసిన త‌రువాత పొత్తుల గురించి ష‌ర్మిల (Sharmila  strategy)తొలిసారిగా మీడియా ముందు ప్ర‌స్తావించారు. అంటే, కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు అంశం వాళ్లిద్ద‌రి మ‌ధ్యా చ‌ర్చ‌కు వ‌చ్చి ఉంటుంద‌ని అనుమానం క‌ల‌గ‌డం స‌హ‌జం. ఎందుకంటే, శివ‌కుమార్(Sivakumar) తో భేటీ త‌రువాత ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం అనే ప్ర‌చారం జ‌రిగింది. అంటే, తెలంగాణ రాజ‌కీయాలు, పొత్తుల గురించి చ‌ర్చించుకుని ఉంటారు అనేది స్ప‌ష్టం. బ‌హుశా కాంగ్రెస్, వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ పొత్తు మీద ఆ భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చి ఉంటుంద‌ని అనుమానించ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే, కేసీఆర్ ను మ‌రింత టార్గెట్ చేస్తూ ష‌ర్మిల గురువారం మీడియా వ‌చ్చారు.

ద‌శాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా కేసీఆర్ కు ష‌ర్మిల‌ ప‌ది ప్ర‌శ్న‌లు

విలీనం ప్ర‌చారానికి తెర‌దించుతూ ద‌శాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా కేసీఆర్ కు ప‌ది ప్ర‌శ్న‌ల‌ను (Sharmila strategy) సంధించారు. తెలంగాణ ఏర్పాటుపై సంబరాలు చేసుకునే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు ష‌ర్మిల‌. హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదో తెలంగాణ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఆవిర్భావ దినోత్సవం పుర‌స్క‌రించుకుని గన్‌పార్క్ వ‌ద్ద‌ అమరవీరులకు నివాళులు అర్పించిన ఆమె కేసీఆర్ వైఫల్యాలపై పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తెలంగాణ సిఎం దౌర్జన్యాలు, వైఫల్యాలను అంగీకరించాలని స‌వాల్ చేస్తూ ఈ పోస్టర్లను విడుదల చేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : CM KCR: తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. దశాబ్ది ఉత్సవాలు!

రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల‌ను ప‌రిశీలిస్తూ ష‌ర్మిల(Sharmila strategy) కేసీఆర్‌కు 10 ప్ర‌శ్న‌లు సంధించారు. కేసీఆర్ ఆ ప్ర‌శ్న‌ల‌కు సమాధానం చెప్పాల‌ని షర్మిల డిమాండ్ చేశారు. ఆ ప్ర‌శ్న‌లు ఇలా ఉన్నాయి.

1. రాష్ట్రాన్ని 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి ఎందుకు నెట్టవలసి వచ్చింది?

2. రాష్ట్రాన్ని పణంగా పెట్టి ఈ పదేళ్లలో ఎంత సంపదను కూడబెట్టారు?

3. వాగ్దానం చేసినట్లు మీరు దళితుడిని రాష్ట్రానికి ఎందుకు సీఎం చేయలేదు?

4. మీరు 10 మిలియన్ ఎకరాల భూమికి ఎందుకు సాగునీరు అందించలేదు?

5. మీరు రైతులకు రుణమాఫీని ఎందుకు పొడిగించలేదు?

6. వాగ్దానం చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ ఉన్నాయి?

7. తెలంగాణ అమరవీరులకు వాగ్దానం చేసిన ఆర్థిక సహాయం ఎక్కడ ఉంది?

8. పోడు భూములను గిరిజనులకు పంపిణీ చేయడంలో ఎందుకు విఫలమయ్యారు?

9. నిరుద్యోగులకు వాగ్దానం చేసిన ఉద్యోగాలు మరియు పెన్షన్లు ఎక్కడ ఉన్నాయి?

10. తొమ్మిదేళ్లు గడిచినా మీరు కేజీ టు పీజీ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు?

“తాలిబాన్ అధ్యక్షుడు“ గా సీఎం కేసీఆర్ ను (Sharmila strategy)

ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకుంటే ఖ‌చ్చితంగా “తాలిబాన్ అధ్యక్షుడు“ గా సీఎం కేసీఆర్ ను ప‌రిగ‌ణిస్తామ‌ని ష‌ర్మిల(Sharmila strategy) అన్నారు. వివిధ సమస్యలపై కేసీఆర్ ద్వంద్వ ప్రమాణాలపై నిందించారు. గత నెల ప్రారంభంలో TSPSC రీ-ఎగ్జామినేషన్‌ను సక్రమంగా నిర్వహించాలని కోరుతూ కేసీఆర్ కోసం రూపొందించిన అఫిడవిట్‌ను విడుదల చేయ‌డం జ‌రిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేసిన ష‌ర్మిల రాజ‌కీయ వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. అందుకోసం బెంగుళూరులోని డీకేతో భేటీ అయ్యార‌ని తెలుస్తోంది. అదే స‌మ‌యంలో రాబోవు రోజుల్లో కేసీఆర్ ను టార్గెట్ చేయ‌డం ద్వారా దూకుడు పెంచాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ప‌నిచేయ‌డానికి సిద్ద‌ప‌డ్డా, బీఆర్ఎస్(BRS) పొత్తు ఉంటే క‌దర‌ద‌ని ష‌ర్మిల చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

Also Read : BRS Lucky : కేసీఆర్ కు వ‌రంగా రూ. 2వేల నోట్ ర‌ద్దు