YS Sharmila: షర్మిల సంచలన నిర్ణయం, ఎన్నికల పోటీకి YSRTP దూరం!

YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్ని రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

  • Written By:
  • Updated On - November 3, 2023 / 12:44 PM IST

YS Sharmila: తెలంగాణ రాజ‌కీయాల్లో తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాల‌ని భావించి ప‌లు అవాంత‌రాలు ఎదుర్కొని వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే వ‌ర‌కు చేరిన దివంగ‌త సీఎం వైఎస్ త‌న‌య వైఎస్ ష‌ర్మిల మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా తమ పార్టీ ఉండాలని నిర్ణయించుకున్నట్లు  షర్మిల తెలిపింది.

కాంగ్రెస్ పార్టీని ఓడించడం మా ఉద్దేశ్యం కాదనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వి వద్దు అని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో YSRTP ఎన్నికల పోటీ కి దూరంగా ఉంటామని, ఏ పార్టీ కోసం కాదు,తెలంగాణ ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని షర్మిల తెలిపారు. మేము పోటీ చేస్తే కేసిఆర్ కి లాభం జరుగుతుందని మేదావులు చెప్పారని, కాంగ్రెస్ పార్టీ కి YSRTP మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని షర్మిల అన్నారు.

అయితే మొదట్నుంచి షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకనుగుణంగా షర్మిల ప్రచార హోరును తీవ్రస్థాయికి తీసుకెళ్లింది. తన మొదటి సభతో తెలంగాణలోని అన్ని పార్టీల ద్రష్టిని ఆకర్షించారు. సామాన్య ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి పొంగులేటిని ఏఐసీసీ పాలేరులో దింపడం, పొంగులేటి, షర్మిక మంచి సంబంధాలు ఉండటంతో రాజకీయ సమీకరణాలు మారాయి. ఒకవేళ షర్మిల పోటీ చేస్తే పొంగులేటి ఓటు బ్యాంక్ పై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల పై నిర్ణయం తీసుకుందని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు.

Also Read: Kajol Pics: లేటు వయసులోనూ ఘాటైన అందాలు, కాజోల్ బోల్డ్ పిక్స్ వైరల్