Site icon HashtagU Telugu

Telangana: డీఎడ్,బీఎడ్ అభ్యర్థులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

Telangana

New Web Story Copy 2023 08 29t204041.937

Telangana: వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై భగ్గుమన్నారు. టీచర్ అభ్యర్థులపై పోలీస్ లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఆమె ఖండించారు. మీరిచ్చిన వాగ్దానం ప్రకారమే 13,086 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తే లాఠీలతో కొట్టిస్తావా అంటూ మండిపడ్డారు. గతంలో అసెంబ్లీలో వాగ్దానం చేసిన విషయం మరిచిపోయావా అంటూ ధ్వజమెత్తారు.

నిండు అసెంబ్లీ సభలో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవా, ఎన్నికల ముందు కూడా మాట మీద నిలబడవా, కొలువుల కోసం తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగులను కొట్టే హక్కు నీకెక్కడిది అంటూ ఫైర్ అయ్యారు. ఇచ్చిన మాట నిలబెట్టుకాకుండా యువత రక్తాన్ని కండ్ల చూస్తావా అన్నారు. నీ కుటుంబానికి ఐదు ఉద్యోగాలుంటే సరిపోతుందా 13096 టీచర్ పోస్టులకు ముష్టి 5 వేలు బిక్షం వేస్తావా అంటూ నిలదీశారు. తొమ్మిదేళ్లుగా టీచర్ పోస్టుల ఊసే ఎత్తకుండా నామమాత్రంగా పోస్టులు భర్తీ చేసి, ఓట్లు దండుకుందామని అనుకుంటున్నావా కేసీఆర్ అంటూ అసహనం వ్యక్తం చేశారు షర్మిల. మాట తప్పితే తల నరుక్కునే నైజమే అయితే? నరం మీద నాలుకే ఉంటే 13086 టీచర్ పోస్టులకు కేసీఆర్ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. డీఎడ్,బీఎడ్ అభ్యర్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ షర్మిల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Also Read: Best Budget Sedan: అదరగొడుతున్నసెడాన్ కార్లు.. ధర, ఫీచర్స్ ఇవే?