YS Sharmila: రాహుల్ కు షర్మిల బర్త్ డే గ్రీటింగ్స్.. దోస్తీ కన్ఫర్మ్?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి ఆయనకు బర్తడే గ్రీటింగ్స్ చెప్తున్నారు. ఈ రోజు రాహుల్ తన 53వ పుట్టిన రోజు వేడుకలను చేసుకుంటున్నారు

Published By: HashtagU Telugu Desk
YS Sharmila

New Web Story Copy 2023 06 19t133657.072

YS Sharmila: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి ఆయనకు బర్తడే గ్రీటింగ్స్ చెప్తున్నారు. ఈ రోజు రాహుల్ తన 53వ పుట్టిన రోజు వేడుకలను చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

రాహుల్ గాంధీ జీ.. చాలా సంతోషకరమైన పుట్టినరోజు. మీరు మీ పట్టుదల,సహనంతో ప్రజలకు ఇలాగే స్ఫూర్తినిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ ఇలానే ఆరోగ్యం, ఆనందంతో విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ షర్మిల ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి విషెష్ తెలియజేశారు.

రాహుల్ బర్తడే సందర్భంగా వైఎస్ షర్మిల ట్వీట్ రాజకీయంగా చర్చకు దారి తీసింది. నిజానికి తెలంగాణాలో కాంగ్రెస్ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. ఈ ఈనేపధ్యంలో కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే తెలంగాణాలో కీలక నేతలు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా, తెలంగాణ కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల పాత్ర ఉంటే పార్టీకి మేలు జరుగుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. ఈ మేరకు వైఎస్ షర్మిలను తమ పార్టీలోకి ఆహ్వానించింది. ఇటీవల ప్రియాంక గాంధీ షర్మిలతో ఫోన్ లో మాట్లాడారు. ఇద్దరి మధ్య దాదాపు గంట పాటు చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చొరవ కూడా ఉండటంతో షర్మిల కాంగ్రెస్ తో దోస్తీ కట్టేందుకు ఆల్మోస్ట్ సిద్దపడినట్టు విశ్వసనీయ వర్గాల వెల్లడి. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

Read More: Dwarampudi vs Pawan: పవన్… నీకు దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు

  Last Updated: 19 Jun 2023, 04:00 PM IST