BRS MLAs: బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు షాకిస్తూ తన ఎమ్మెల్యే పదవిపై వేటు వేసిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో ఎన్నికల అఫిడవిట్లో వనమా తప్పుడు లెక్కలు చూపించారంటూ జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. గత నాలుగు సంవత్సరాలు ఆ కేసుపై జలగం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు తీర్పునిచ్చింది. వనమా ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది. అంతేకాదు, ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో ఓడిన జలగం వెంకట్రావుని ఎమ్మెల్యేగా నియమించింది.
బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమాలే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అంతా ఎన్నికల కమీషన్ ను తప్పు దోవ పట్టించిన వాళ్లేనంటూ ఆరోపించారు. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలేనన్నారు.ఎన్నికల అఫిడవిట్లో చూపింది గోరంతైతే దాచింది కొండంత.లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతం.అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి,తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి YSR తెలంగాణ పార్టీ విజ్ఞప్తి చేస్తుందని ఆమె తెలిపారు.ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నామని స్పష్టం చేశారు షర్మిల.
Also Read: Against Modi Govt : అవిశ్వాసంకు స్పీకర్ ఆమోదం, నెంబర్ గేమ్ లో విపక్ష కూటమి