Site icon HashtagU Telugu

CS Post : సీఎస్ పదవికి శాంతి కుమారి రాజీనామా ?

Shanthakumari Cs

Shanthakumari Cs

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి (Shanthi Kumari) రాజీనామా చేయనున్నారనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ నెలాఖరుతో ఆమె పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి 2023 జనవరి 11న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆమె ఆ స్థానాన్ని అధిష్టించారు. ఇప్పుడామె పదవీ విరమణకు సిద్ధమవుతుండటంతో తర్వాతి సీఎస్‌గా రామకృష్ణారావును నియమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Electric vehicles : BattREతో భాగస్వామ్యం చేసుకున్న EV91

ఈ పరిణామాల వెనుక ఒక ముఖ్య కారణం రాష్ట్ర సమాచార హక్కు చట్టం (RTI) ప్రధాన కమిషనర్ పదవి కావచ్చని సమాచారం. 2020లో ఆ పదవి ఖాళీ అయిన తర్వాత 2023 ఫిబ్రవరిలో చివరి కమిషనర్ పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అయితే ఈ ఏడాది జనవరి 7న సుప్రీంకోర్టు రాష్ట్రాల్లోని RTI కమిషనర్ల పోస్టులను ఎనిమిదివారాల్లో భర్తీ చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇదే సమయంలో శాంతి కుమారి పేరు ఆ పదవికి ఖరారయ్యే అవకాశం ఉంది.

గత ఏడాది జూన్ నెలలో ప్రభుత్వం RTI కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయగా, అనేక మంది జర్నలిస్టులు, న్యాయవాదులు, పదవీ విరమణ చేసిన అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి మధ్య పరిశీలన అనంతరం శాంతి కుమారి ఎంపిక అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. సచివాలయంలో ఇటీవల జరిగిన సమావేశంలో ఆమె పేరును పరిశీలించినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆమె ఎంపిక ఖరారైతే, తన వృద్ధాప్య విరమణ ముందు స్వచ్ఛందంగా సీఎస్ పదవికి రాజీనామా చేసి, కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.