Site icon HashtagU Telugu

MLA Raja Singh : బిజెపి సభలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు అవమానం..

Rajasingh

Rajasingh

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Rajasingh ) కు బిజెపి సభలో ఘోర అవమానం చోటుచేసుకోవడం ఆయన వర్గీయులు తట్టుకోలేకపోతున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని LB స్టేడియంలో భారీ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అయితే బీజేపీ కీలక నేతలు సభా వేదికపైకి హాజరవాల్సి ఉండగా.. ఎమ్మెల్యే రాజాసింగ్ ను మాత్రం వెళ్లనివ్వలేదు. రాజాసింగ్ వేదికపైకి వెళ్తుండగా.. ప్రధాని మోడీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయిన ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) అనుమతి నిరాకరించింది.

తాను బీజేపీ ఎమ్మెల్యేను అని చెప్పుకున్నా ఎస్పీజీ సిబ్బంది ఎమ్మెల్యేను సభపైకి అనుమతించలేదు. సభ జరిగే నిర్దేశించిన సమయం కన్నా ఆలస్యంగా వచ్చారనే కారణంతోనే రాజాసింగ్ ను ఎస్పీజీ సిబ్బంది ఆపేసి ఉంటారని రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన పట్ల రాజాసింగ్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజసింగ్ ను సభకు పిలిచి అవమానించారని వారంతా వాపోయారు. సభా వేదికపైకి వెళ్లేందుకు రాజాసింగ్ ఎంతో ట్రై చేసిన అనుమతించకపోవడంతో.. ఇక ఆయన చేసేది లేక ప్రజలతో పాటు కూర్చొన్నారు. సాధారణ కుర్చీల్లో ప్రజల మధ్యకు వచ్చి తన అనుచరులతో సహా కూర్చొని ప్రధాని ప్రసంగం విన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ సభలో మోడీ మాట్లాడుతూ..జూన్ 4న దేశం గెలుస్తుందని.. 140 కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 4న త్రిపుల్ తలాఖ్, సీఏఏ, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన వారు ఓడిపోక తప్పదని మోడీ అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని ప్రజలు నిశ్చయించుకున్నారని, బీజేపీని గెలిపించుకోవాలని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

ఈరోజు భారత్‌ డిజిటల్‌ రంగం, అంకుర సంస్థల్లో సూపర్ పవర్‌గా నిలిచిందని మోడీ పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డుగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో నగరంలో ఎన్నోచోట్ల బాంబు పేలుళ్లు జరిగాయని, దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా గుడి వద్ద బాంబు పేలుడు జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో ఎక్కడికెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేదని, గత పదేళ్ల కాలంలో అలాంటి పరిస్థితిని చూశారా? అని ప్రశ్నించారు. ఈ బాంబ్ బ్లాస్ట్ లు ఎవరు ఆపారు? ఈ బాంబ్ బ్లాస్ట్ లు ఘనత మాది’’ అని మోడీ చెప్పుకొచ్చారు.

Read Also : Prajwal Revanna : ప్రజ్వల్ రేవణ్ణపై మరో అత్యాచారం కేసు నమోదు