తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections 2023)కు పట్టుమని 40 రోజుల సమయం కూడా లేదు. అయినప్పటికీ అన్ని పార్టీల అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఇంకా ప్రచారం మొదలుపెట్టలేదు. కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) పార్టీలైతే ఇంకా పూర్తీ స్థాయిలో తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ప్రజల్లో రోజు రోజుకు ఆసక్తి పెరుగుతుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు తగ్గ పోరు గా ఉండబోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ – బిజెపి పార్టీల మధ్య నువ్వా నేనా అనేంత పోరు ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈసారి ఎన్నికల్లో బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గాల (Kamareddy Constituency) నుండి బరిలోకి దిగబోతున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి నుండి పోటీ చేయడానికి కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Shabbir Ali) భయపడుతున్నారని, ఆయన కామారెడ్డి నుండి పోటీ చేసే ఆలోచనలో లేరని , నిజామాబాద్, జూబ్లిహిల్స్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసారు. తాను నిజామాబాద్, ఎల్లారెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్నా అంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. ఇదంతా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారం అని మండి పడ్డారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని కేసీఆర్ ఎప్పుడు ప్రకటించాడో అప్పుడే తాను కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తన పుట్టుక, చావు అంతా కామారెడ్డిలోనే అయి తేల్చి చెప్పారు. ప్రజా క్షేత్రంలో కేసీఆర్ తో తాడో పేడో తేల్చుకోబోతున్నామని అన్నారు. ఇదిలా ఉంటే ఈనెల 25వ తేదీన కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
Read Also : SBI PO Admit Card: SBI PO ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!