Shabbir Ali : అతి త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్లబోతున్నాడు – షబ్బీర్ అలీ

ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమని, అందులో నేను కూడా ఓ బాదితుడినే అని చెప్పుకొచ్చారు

Published By: HashtagU Telugu Desk
Shabbir Ali Phone

Shabbir Ali Phone

అతి త్వరలో కేసీఆర్ (KCR) జైలుకు (Jail) వెళ్ళబోతున్నాడంటూ కీలక వ్యాఖ్యలు చేసారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali). ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping ) వ్యవహారం కాకరేపుతున్న సంగతి తెలిసిందే. గత బిఆర్ఎస్ (BRS) హయాంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసి కోట్లు దండుకోవడమే కాకుండా సినీ , రాజకీయ , బిజినెస్ నేతలను బెదిరింపులు పాల్పడ్డానంటూ ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీలక సూత్రదారులన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తం మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కనుసన్నల్లోనే జరిగిందంటూ బిజెపి , కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలను కేటీఆర్ ఖండిస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఫై షబ్బీర్ అలీ (Shabbir Ali) స్పందించారు. సోమవారం కామారెడ్డి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమని, అందులో నేను కూడా ఓ బాదితుడినే అని చెప్పుకొచ్చారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసారని , తాను, తన భార్య మాట్లాడుకున్న ప్రైవేట్ సంభాషణలు సైతం విన్నారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాప్ అవుతోందని ఏడాది ముందే రేవంత్ రెడ్డి తెలిపినట్లు గుర్తు చేసారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్తుందని జోస్యం తెలిపారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిందో..లోక్ సభ ఎన్నికల్లో కూడా భారీ విజయం సాదించబోతుందని ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని..ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Read Also : Dasoju Sravan: ‘సీఎం రేవంత్ కు దాసోజు లేఖ.. ప్రస్తావించిన అంశాలివే

  Last Updated: 15 Apr 2024, 06:45 PM IST