IIIT Basara : బాస‌ర ఐఐఐటీలో విద్యార్థుల‌కు ఫుడ్ పాయిజ‌న్‌..?

బాస‌ర‌ ఐఐఐటీలో విద్యార్థులు ఫుడ్‌పాయిజ‌న్ బారిన ప‌డ్డారు. 40 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

  • Written By:
  • Updated On - July 16, 2022 / 12:39 AM IST

బాస‌ర‌ ఐఐఐటీలో విద్యార్థులు ఫుడ్‌పాయిజ‌న్ బారిన ప‌డ్డారు. 40 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. నిర్మల్‌ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పోలీసులు కేసును విచారిస్తున్నారని, తనకు తెలిసిన మేరకు విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపారు.గ‌త నెల‌లో ఇక్క‌డి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు. త‌మ‌కు సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. హాస్ట‌ల్ లో వ‌స‌తులు స‌రిగా లేవ‌ని విద్యార్థులు ఆందోళ‌న చేశారు. అయితే ప్ర‌భుత్వం క‌లుగ‌జేసుకుని విద్యార్థుల హామీల‌ను నేర‌వేరుస్తామ‌ని చెప్ప‌డంతో వారంతా ఆందోళ‌న విర‌మించారు. అయితే తాజాగి విద్యార్థులు ఫుడ్‌పాయిజ‌న్‌కి గుర‌వ్వ‌డం హాస్ట‌ల్ లో ప‌రిస్థితుల‌కు అద్దంప‌డుతోంద‌ని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.