Site icon HashtagU Telugu

Drugs : హైద‌రాబాద్‌లో ఏడుగురు డ్ర‌గ్స్ వ్యాపారులను అరెస్ట్ చేసిన పోలీసులు

Drugs

Drugs

డ్రగ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్నాఏడుగురిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ బృందం పట్టుకుంది. వారి వద్ద నుంచి 310 ఎంఎల్‌ హషీష్‌ ఆయిల్‌, 70 గ్రాముల చరస్‌ 8 మొబైల్‌ ఫోన్లు,బైక్‌ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సయ్యద్ ముజఫర్ అలీ (26), అబూబకర్ బిన్ అబ్దుల్ అజీజ్ (23), మహ్మద్ ఖాసీం (35), సయ్యద్ ముర్తుజా అలీ హుస్సేన్ (34), ముబాషీర్ ఖాన్ (28), నితిన్ గౌడ్ (22), టి పూనమ్ కుమారి కౌర్ (27) ల‌ను అరెస్ట్ చేశారు. జీషన్ నవీద్, సయ్యద్ అన్వరుల్లాహుస్సేని క్వాద్రీ పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ముజఫర్ అలీ డ్రగ్స్‌కు బానిసయ్యాడని.. అదే వ్యసనానికి బానిసైన స్నేహితుడు అబూబకర్ ద్వారా హాష్ ఆయిల్ అమ్మి.. సులువుగా డబ్బు సంపాదించాలని ఇద్దరూ పథకం వేశారని పోలీసులు తెలిపారు. వారి పథకం ప్రకారం.. వారు తమ కామన్ ఫ్రెండ్ మహ్మద్‌ఖాసీమ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాడేరు, అరకుకు ఒక లీటర్ హాష్ ఆయిల్‌ను రూ. 80,000కి పొందేవారు. దీనిని నిందితులు ముగ్గురు క‌లిసి.. చిన్న చిన్న 5 ఎంఎల్‌ బాటిళ్లను నింపి ఒక్కో బాటిల్‌ను రూ.2000 చొప్పున జీషన్‌, అన్వరుల్లా, ముర్తుజా, నితిన్‌, పూనమ్‌లకు విక్రయించేవారని పోలీసులు తెలిపారు. ఈ సబ్-పెడ్లర్లు హాష్ ఆయిల్ మరియు చరస్‌లను అవసరమైన వినియోగదారులకు 5 మి.లీ రూ. 3,000 చొప్పున విక్రయించేవారని పోలీసులు తెలిపారు. ప‌క్కా స‌మాచారంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

Also Read:  Telangana CM Office: తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీస్ గా MCRHRD

Exit mobile version