7 BRS Ministers : వెనుకంజలో ఏడుగురు బీఆర్ఎస్ మంత్రులు

7 BRS Ministers : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య ఫలితాలు వచ్చాయి.

Published By: HashtagU Telugu Desk
Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

7 BRS Ministers : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య ఫలితాలు వచ్చాయి. చాలా సిట్టింగ్ స్థానాల్లో బీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీచింది. ఎదురుగాలి ఎంతగా వీచిందంటే.. ఏకంగా 6 స్థానాల్లో బీఆర్ఎస్ మంత్రులు వెనుకంజలో ఉండిపోయారు. కాంగ్రెస్ హస్తం హవా ఎదుట బీఆర్ఎస్ అభ్యర్థులు నిలువలేకపోయారు. వెనుకంజలో ఉన్న బీఆర్ఎస్ మంత్రుల జాబితాలో ఎర్రబెల్లి దయాకర్ రావు(పాలకుర్తి),  ఇంద్రకరణ్ రెడ్డి,  కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి,  వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఇక ఈటల రాజేందర్​ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు.  తాజా సమాచారం ( 11 గంటల వరకు) కాంగ్రెస్​ 65, బీఆర్ఎస్​43 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. స్టేషన్ ఘనపూర్, జనగామలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెనుకబడ్డారు. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. కాంగ్రెస్ నేతలు సీతక్క, కొండా సురేఖ ముందంజలో కొనసాగుతుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థులు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గట్టి పోటీని(7 BRS Ministers) ఎదుర్కొంటున్నారు.

Also Read: Hindi Belt : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ లీడ్

  Last Updated: 03 Dec 2023, 11:43 AM IST