Site icon HashtagU Telugu

Sridhar Babu : పాఠశాలలు, కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

Thousand Jobs In Telangana

Thousand Jobs In Telangana

Minister Sridhar Babu On Education System : అన్ని స్కూల్స్, కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు.

Read Also: Guru Charan Passes Away : గురు చరణ్ ఇక లేరు

విద్యారంగ సంస్కరణలపై సచివాలయంలో అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై ఉన్నతాధికారులకు ఆయన మార్గదర్శకం చేశారు. కోచింగ్ సెంటర్ల నియంత్రణపై కేంద్రం గైడ్‌లైన్స్‌ని అమలు చేసి వీటిని కట్టడి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రైవేట్‌ స్కూల్స్‌, ఇంటర్మీడియట్ కళాశాల ఫీజుల నిర్దారణపై నియంత్రణ కమిటీ ఏర్పాటే చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు శ్రీధర్‌బాబు వెల్లడించారు.

అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లను వేర్వేరుగా నడపడం వల్ల మానవ వనరుల వృథా జరుగుతోందని రెండింటిని విలీనం చేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు. విద్యార్థులు లేని 1,600 పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు బదిలీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యురాలు పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రతిభా కేంద్రాలుగా తీర్చిదిద్దగలిగితే పేద విద్యార్ధులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Read Also: Nepotism : నెపోటిజం ఫై రకుల్ షాకింగ్ కామెంట్స్