Site icon HashtagU Telugu

September 17 : పార్టీల‌కు ఫ‌క్తు `పొలిటిక‌ల్ డే`

September 17

September 17

September 17 : సెప్టెంబ‌ర్ 17వ తేదీని ప్ర‌తి ఏడాది రాజ‌కీయ కోణం నుంచి పార్టీలు చూడ‌డం స‌ర్వ‌సాధార‌ణం అయింది. ఆ తేదీని విమోచ‌న‌ దినోత్స‌వంగా బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం విలీనం దినోత్స‌వంగా జ‌రుపుతోంది. విద్రోహ దినంగా ఎంఐఎం జ‌రుపుకుంటోంది. హైదరాబాద్‌ స్టేట్‌ భారత యూనియన్‌లో కలిసిన సెప్టెంబర్‌ 17వ తేదీని ‘తెలంగాణ జాతీయ సమైక్యతాదినంగా పాటించాలని గ‌త ఏడాది కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈ ఏడాది వ‌జ్రోత్స‌వాల ముగింపు 16,17,18 తేదీల్లో ప్రారంభోత్సవాలు జ‌ర‌పాలి. కానీ, గ‌త ఏడాది చెప్పిన మాట‌ల‌ను మ‌రిచిపోయిన కేసీఆర్ 17వ తేదీన పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్స‌వాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది.

కేసీఆర్ 17వ తేదీన పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్స‌వాన్ని..(September 17)

వాస్త‌వంగా ఉమ్మ‌డి ఏపీలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విడిపోయిన త‌రువాత ఫ‌క్తు రాజ‌కీయ‌వాదిగా మారిన కేసీఆర్ ఆ డిమాండ్ ను మ‌రిచిపోయారు. మిగిలిన పార్టీలు మాత్రం సెప్టెంబ‌ర్ 17వ తేదీని (September 17) ప్ర‌తి ఏడాది రాజ‌కీయంగా చూస్తూ ఎవరికి తోచిన విధంగా వాళ్లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. ప్ర‌త్యేకించి బీజేపీ విమోచ‌న దినోత్స‌వాన్ని జ‌రుపుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 17వ తేదీన సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున స‌భ‌ను నిర్వ‌హిస్తోంది. ఆజాదీకా అమృత‌మ‌హోత్స‌వం ముగింపును కూడా అదే రోజు జ‌రుపుతోంది. అదే స‌భ‌ను విమోచ‌న దినం సంద‌ర్భంగా జరిపేలా కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఆ మేర‌కు బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు.

కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని

ఈసారి కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని జ‌రుపుతోంది. దానికి ముఖ్య అతిథిగా అమిత్ షా రాబోతున్నారు. పెద్ద సంఖ్య‌లో జ‌నాన్ని త‌ర‌లించ‌డం ద్వారా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల దిశ‌గా క‌మ‌ల‌ద‌ళాన్ని ముందుకు న‌డిపించాల‌ని యోచిస్తున్నారు. స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను ఇప్ప‌టి నుంచే ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశాల‌ను పెట్టింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఢిల్లీ నుంచి అగ్ర‌నేత‌లు కాంగ్రెస్ తెలంగాణ విభాగాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి వ‌స్తున్నారు. అందుకోసం స‌న్నాహాల‌ను ఆ పార్టీ చేస్తోంది. తుక్కుగూడ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ  (September 17)బ‌హిరంగ స‌భ, ర్యాలీ జ‌ర‌గ‌నుంది. ఆ మేర‌కు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించ‌డానికి బుధ‌వారం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ హైద‌రాబాద్ వ‌చ్చారు. అర్థ‌రాత్రి వ‌ర‌కు కీల‌క లీడ‌ర్ల‌తో ఆయ‌న సమావేశం అయ్యారు.

Also Read : BRS Graph: బీఆర్ఎస్ గ్రాఫ్ ఢమాల్, కేసీఆర్ నాయకత్వంపై వ్యతిరేకత?

కమ్యూనిస్ట్ లు కూడా సెప్టెంబ‌ర్ 17వ తేదీని విముక్తి దినోత్స‌వంగా జ‌రుపుకుంటారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ విలీనం దినోత్స‌వంను నిర్వ‌హిస్తోంది. విమోచ‌నంగా బీజేపీ, విద్రోహంగా ఎంఐఎం జ‌రుపుకోవ‌డానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక అధికారంలోని బీఆర్ఎస్ మాత్రం సెప్టెంబ‌ర్ 17వ తేదీని లైట్ గా తీసుకుంది. గ‌త ఏడాది జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వంగా మూడు రోజుల పాటు జ‌రిగింది. ఏడాది పొడ‌వునా ఈ ఉత్స‌వాల‌ను జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించింది. కానీ, సెప్టెంబ‌ర్ 17వ తేదీన పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ప్రారంభించ‌డం ద్వారా ద‌క్షిణ తెలంగాణ మీద ప‌ట్టు సాధించే ప్ర‌య‌త్నం చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక వైపు నుంచి నీళ్ల‌ను తోడేలా ఈ ప‌థ‌కాన్ని రూపొందించారు. దీంతో పాల‌మూరు, రంగారెడ్డి జిల్లాల‌తో పాటు న‌ల్గొండ స‌స్య‌శ్యామ‌లం అవుతుంద‌ని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే, పెద్ద ఎత్తున ఈ ప‌థ‌కం ప్రారంభోత్స‌వాన్ని నిర్వ‌హించడానికి కేసీఆర్ అండ్ టీమ్ సిద్ద‌మ‌యింది. మొత్తం మీద సెప్టెంబ‌ర్ 17వ తేదీని ఎవ‌రికి వారే ఫ‌క్తు రాజ‌కీయ డే గా భావిస్తూ వ‌చ్చే ఎన్నిక‌ల శంఖారాన్ని వినిపించ‌బోతున్నారు.

Also Read : Congress New Strategy : కాంగ్రెస్ న‌యా పోక‌డ‌! కోమ‌టిరెడ్డికి పదోన్న‌తి హామీ!