Telangana Politics : తెలంగాణ రాజ‌కీయాల్లో సెప్టెంబ‌ర్ 17 లొల్లి

ప్ర‌తి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సెప్టెంబ‌ర్ 17వ తేదీ కేంద్రంగా రాజ‌కీయ లొల్లి మొద‌లైయింది.

  • Written By:
  • Publish Date - September 3, 2022 / 12:12 PM IST

ప్ర‌తి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సెప్టెంబ‌ర్ 17వ తేదీ కేంద్రంగా రాజ‌కీయ లొల్లి మొద‌లైయింది. విమోచ‌న దినంగా జ‌ర‌పాల‌ని బీజేపీ తొలి నుంచి డిమాండ్ చేస్తోంది. యాథాత‌దంగా విద్రోహ‌దినోత్స‌వాన్ని ఎంఐఎం జ‌రుపుతోంది. ఇలా విలీనం, విమోచ‌నం, విద్రోహం పేరుతో ప్ర‌తి ఏడాది సెప్టెంబ‌ర్ 17వ తేదీన రాజ‌కీయ హీట్ ను చూస్తున్నాం. ఈసారి కూడా అదే వేడి క‌నిపిస్తోంది. ఆ రోజున విమోచ‌న దినోవ‌త్సంగా జ‌ర‌పాల‌ని కేసీఆర్ స‌ర్కార్ ను బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ మేర‌కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ మీడియాకు తెలిపారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇలా ఉన్నాయి.

*తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదు. ఇచ్చిన మాట తప్పి తెలంగాణ అమరులను అవమానిస్తున్న దుర్మార్గుడు కేసీఆర్

*‘విమోచన దినం’ కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట మరో జమ్మిక్కుకు ప్లాన్ చేస్తున్న కేసీఆర్

*కేసీఆర్ నిఖార్సైన తెలంగాణ వాది అయితే తక్షణమే విమోచనోత్సవాలు నిర్వహించాలి. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తాం

* సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అమర వీరులను ఘోరంగా అవమానిస్తున్నారు.

*అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ సీఎం పీఠమెక్కినాక ఆ అవసరమే లేదంటూ మాట తప్పడం దుర్మార్గం.

*తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించకపోవడానికి అసలు కారణమేంటో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి.

*ఎంఐఎం పార్టీకి భయపడి సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించకపోవడం సిగ్గు చేటు.

*తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట కేసీఆర్ మరో జమ్మిక్కుకు ప్లాన్ చేస్తుండటం సిగ్గు చేటు. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణవాది అయితే గతంలో ఇచ్చిన మాట మేరకు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి తీరాలి.

*తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలంటూ అనేక ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే.

*తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర పర్యాట, సాంస్క్రుతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సమీక్ష చేయడాన్ని స్వాగతిస్తున్నాం.

* రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించి తీరుతాం.