Singareni: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. సింగరేణి నుంచి శ్రీధర్ ఔట్, బలరాం ఇన్!

  • Written By:
  • Updated On - January 3, 2024 / 12:34 PM IST

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన విభాగంపై పూర్తిగా పట్టు సాధిస్తోంది. నేటికి సరిగ్గా ౩౦ రోజులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలలో తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనది సింగరేణి చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీధర్ ని తొలగింపు. ఆ బాధ్యతలు బలరాం నాయక్ కు అప్పగించింది. దీంతో పలువురు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై స్వాగతిస్తున్నారు. ఇటీవలనే డిప్యూటీ సిఎం భట్టి  ‘కాలేరు పరిస్థితుల’పై లోతుగా సమీక్ష జరిపి వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఓపెన్ కాస్ట్ టెండర్లను ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం, సిఎస్ఆర్ నిధులతో సహా డిస్ట్రిక్ట్ మినరల్ నిధులను సింగరేణిని దాటించడం, ఉద్యోగ వారసత్వం నియామకాల్లో లంచాలు, ఇవన్నీ బిఆర్ ఎస్ పార్టీ కార్మిక సంఘం సమక్షంలో జరిగాయని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ పదేళ్ళలో గత సంఘాలు ఎలా దెబ్బతీశాయో ఈ నివేదిక కూలంకషంగా చర్చించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ ని తొలగించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీర డంతోనే సింగరేణి సీఎండీ మార్పు ఖాయమని, భారీ ప్రక్షాళన జరుగుతుందనే ప్రచారం సాగింది. దీనికితగ్గట్లే.. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించిన వారం రోజుల్లోపే చైర్మన్‌ను పక్కనపెట్టడం గమనార్హం. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులను సింగరేణి సమీప ప్రాంతాలకు కాకుండా సిరిసిల్ల, సిద్దిపేట, హైదరాబాద్‌, నిజామాబాద్‌ తదితరచోట్లకు తరలించారని కార్మిక నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీధర్‌ను పక్కన పెట్టిందనే చర్చ కోల్‌ బెల్ట్‌లో జరుగుతోంది.

Also Read: Indrakiladri: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ, మార్మోగిన జై దుర్గా నామస్మరణ!