Site icon HashtagU Telugu

Governor Tamilisai : గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు…ఎంత వివక్ష చూపినా, నా పని నేను చేసి తీరుతా..!!

Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

తమిళిసై సౌందర్ రాజన్…తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు గవర్నర్. గవర్నర్ కార్యాలయంపై తీవ్రమైన వివక్ష చూపిస్తున్నారన్నారు. తనకి ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. తనకి గౌరవం ఇవ్వకపోతే…తానేమీ తక్కువకాదన్నారు. గవర్నర్ గా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా…ప్రొటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారామే. ఎన్ని అడ్డంకులు స్రుష్టించినా…నా పని నేను చేసుకుంటూ పోతానని స్పష్టం చేశారు.

గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన 3ఏళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. మేడారం సమ్మక్క సారక్క పర్యటనలో నన్ను అవమానించారని గవర్నర్ విమర్శించారు. హెలికాప్టర్ అడిగిన సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. దీంతో 8 గంటలు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ మూడు సంవత్సరాలలో రాజ్ భవన్ను ప్రజాభవన్ గా మార్చామని ఈ సందర్భంగా తమిళి సై తెలిపారు.