Site icon HashtagU Telugu

Congress : సెల్ఫీ విత్ ఫ్రీ పవర్ సిగ్నేచర్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కాంగ్రెస్ లీడ‌ర్లు

Congress

Congress

ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ అని మ‌రోసారి తెలిపారు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌.. సీఎల్పీ కార్యాల‌యంలో సెల్ఫీ విత్ ఫ్రీ ప‌వ‌ర్ సిగ్నేచ‌ర్ కార్య‌క్ర‌మంలో భ‌ట్టి విక్ర‌మార్క పాల్గొన్నారు. ఉచిత కరెంటు తమ పాలసీ అంటూ సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రతి సందర్బంలో పచ్చి అబద్దాలు మాట్లాడుతూ తెలంగాణ సమాజన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలు, ఆగడాలను అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీగా 60 సంవత్సరాలుగా తెలంగాణలో ఏం అభివృద్ధి చేశామో.. తెలంగాణ ప్రజలకు చెప్పడానికి సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనుల ముందు సెల్ఫీ దిగి తాము చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తామ‌ని తెలిపారు.

ఉచిత విద్యుత్తు బీఆర్ఎస్‌ తెచ్చిందంటూ.. అంతకు ముందు లేదన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా పచ్చి అబద్ధాలు చెబుతూ రాష్ట్రాన్ని, దేశాన్ని మోసం చేస్తున్నారని భ‌ట్టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ పాలకులు చెప్పినట్లుగా మాయమాటలు అబూత కల్పన కాంగ్రెస్ చెప్పట్లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత కరెంటు పై తొలి సంతకం చేశారని ఆ రోజు చారిత్రాత్మకమైంద‌న్నారు. ఉచిత కరెంటు ఫైల్ పై సంతకం చేసిన ఫోటోను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆలోచన చేయని రోజుల్లోనే పీసీసీ అధ్యక్షుడిగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ గా చక్రపాణి .. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుమతితో ఉచిత విద్యుత్ అంశాన్ని 1999 సంవత్సరం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారని గుర్తు చేశారు. వ్యవసాయం నీటిపారుదల అనే అంశం కింద రైతులకు ఉచిత విద్యుత్తు, విద్యుత్ బకాయిల మాఫీ, విద్యుత్ కనెక్షన్ల కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో పరిష్కారం, కొత్త దరఖాస్తులను 30 రోజులలో పరిష్కరిస్తామన్నారు. తాము 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తామ‌ని.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన పవర్ ప్రాజెక్టు కంటిన్యూ చేయడం వల్లనే ఇప్పుడు విద్యుత్ కోతలు లేవన్న విషయం వాస్తవమ‌న్నారు.