Site icon HashtagU Telugu

Tammineni Veerabhadram: ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక గ్రామ సభలోనే జరగాలి: తమ్మినేని వీరభద్రం

Tammineni Veerabhadram

Tammineni Veerabhadram

Tammineni Veerabhadram: ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జ‌ర‌గ‌నున్నాయి. జనవరి 25వ తేదీన సంగారెడ్డి PSR గ్రౌండ్‌లో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ నిర్వ‌హించ‌నున్నారు. మహాసభలు బహిరంగ సభ పోస్టర్‌ను సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రేవంత్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ, హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చుతుంది. నిర్బంధంలో రాష్ట్రం ఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఏడో వాగ్దానం స్వేచ్ఛ ఇప్పుడు అమలు కావడం లేదు. మహాసభల్లో రేవంత్ సర్కార్ నిర్ణయాలపై చర్చ జరుపుతామన్నారు. జనవరి 26 నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రేవంత్ సర్కార్ చెప్పింది. రైతు భరోసాతో ప్రభుత్వం చెప్పిన హామీలు చేస్తామని ప్రకటన చేయడం హర్షణీయం అని ఆయ‌న అన్నారు.

Also Read: Sukesh Income : నా ఆదాయం రూ.7,640 కోట్లు.. పన్ను చెల్లిస్తా తీసుకోండి.. సుకేశ్ సంచలన లేఖ

ఇంకా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల కోసం- ఎన్నికల లబ్దికోసమే కాకూడదు. ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక గ్రామసభలోనే జరగాలి. ఇందిరమ్మ ఇండ్ల అర్హత కోసం రేషన్ కార్డు, జాబ్ కార్డు పెట్టకూడదు. జాబ్ కార్డులు, రేషన్ కార్డులు లేని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు పథకాలు తప్ప హామీలు అమలు చేయలేదు. పట్టణాల్లో ఉపాధి హామీ అమలు చేయాలని కోరుతున్నామ‌న్నారు. మేము ప్రభుత్వంలో భాగస్వామ్యంగా లేమని, మేము ప్రభుత్వానికి మిత్రపక్షం కూడా కాదని స్ప‌ష్టం చేశారు. మేము మిత్రపక్షం అయితే మంత్రి పదవులు తీసుకునే వాళ్ళమ‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై త్వరలో పోరాటాలు మొదలు పెడతామ‌ని తెలిపారు.

CPM పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

బీవీ రాఘవులు మాట్లాడుతూ.. లేబర్ కోర్టుల అంశంలో కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. తెలంగాణలో లేబర్ కోర్టు రూల్స్ అమలు జరపమని రేవంత్ ప్రభుత్వం ప్రకటన చేయాలి. ఒక దేశం- ఒక ఎన్నిక అనేది నిరంకుశ వ్యవస్థ అన్నట్లే. వన్ నేషన్ -వన్ ఎలక్షన్ పై BRSపై స్పష్టమైన ప్రకటన చేయాలి. ఎలక్షన్ కాంట్రాక్టు రూల్స్ ను కేంద్ర బీజేపీ చేసింది. దీని వల్ల ఎన్నికలు పారదర్శకంగా జరగకుండా జరిగే అవకాశం ఉంది. ఎలక్షన్ డిజిటల్ రికార్డులు ప్రజలకు ఇవ్వకుండా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయి. ఆ నిబంధనలు సవరించాలి. భట్టి ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ పది శాతం బడ్జెట్ లో కేటాయిస్తామని ఘనమైన చరిత్ర అన్నట్లు ప్రకటించారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు బడ్జెట్ కేటాయింపులు 25శాతం పెంచాలన్నారు.