Site icon HashtagU Telugu

Indiramma Houses: ఈనెల 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక!

Minister Ponguleti

Minister Ponguleti

Indiramma Houses: తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి దాదాపు సంవ‌త్స‌రం కావొస్తున్న సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రేవంత్ స‌ర్కార్ గుడ్ న్యూస్ వినిపించ‌నుంది. ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం అమలు చేసినా ప్ర‌భుత్వం.. తాజాగా ఇందిరిమ్మ ఇళ్ల పంపిణీకి (Indiramma Houses) రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ముందుగా మొబైల్ యాప్‌ను గురువారం ముఖ్య‌మంత్రి రేవంత్ చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌నుంది.

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక‌ కోసం మొబైల్‌ యాప్‌ సిద్ధమైందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ యాప్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 6 (శుక్రవారం) నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: Grenade Attack : ఆర్మీ క్యాంపుపై టెర్రర్ ఎటాక్.. గ్రనేడ్లతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు

మాదాపూర్‌లో రేపు ఇందిరా మహిళా శక్తి బజార్‌ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో డిసెంబ‌ర్ 5వ తేదీన ఇందిరా మహిళా శక్తి బజార్‌ ప్రారంభోత్సవం జ‌ర‌గ‌నున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. SHG ప్లాట్‌ఫారమ్‌లలో ఇందిరా మహిళా శక్తి విజయాలు, ప్రజాపాలన విజయాలపై ప్రెస్ మీట్ నిర్వ‌హించ‌నున్నారు. అలాగే మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండలో 3 అధునాతన సాంకేతిక కేంద్రాల (ATCలు) ప్రారంభోత్సవం చేయ‌నున్నారు. ఘట్‌కేసర్‌లో బాలికలకు ఐటీఐకు అలాగే ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక మొబైల్ యాప్ ఆవిష్కరణ జ‌ర‌గ‌నుంది.

రేపు మొబైల్ యాప్ ఆవిష్క‌ర‌ణ‌

ప్రజా విజయోత్సవంలో భాగంగా రేపు సీఎం రేవంత్ స‌ర్కార్ పేద‌వాడి సొంతింటి క‌ల సాకారం చేయనుంది. ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ల‌బ్దిదారుల ఎంపిక‌కు రంగం సిద్ధం చేసింది. పారదర్శకంగా ఎంపికకు మొబైల్ యాప్‌ను లాంచ్ చేయ‌నుంది. రేపు (5వ తేది) గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యాప్ ఆవిష్కరణ జ‌ర‌గ‌నుంది. 6వ తేదీ నుంచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జ‌ర‌గ‌నుండ‌గా.. ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ ఏర్పాటు చేయ‌నున్నారు.