Site icon HashtagU Telugu

Gruha Jyothi Zero Electricity Bill : జీరో బిల్లు కొట్టిన సీతక్క

Sithakka Zero Billu

Sithakka Zero Billu

తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపుతో పాటు ఇటీవల మరో రెండు గ్యారంటీలైన రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల (Gruha Jyothi) వరకు ఫ్రీ కరెంట్ (Electricity Bill) పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 లక్షలకు పైగా వినియోగదారులకు ‘జీరో’ విద్యుత్‌ బిల్లులు జారీ చేసారు. దీంతో అనేక నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు జీరో కరెంట్ బిల్లు కొట్టి వినియోగదారులకు అందజేసి వారిలో ఆనందం నింపుతున్నారు.

తాజాగా ములుగు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి సీతక్క ..జీరో పథకం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గృహ జ్యోతి సబ్సిడీ క్రింద కరెంట్ బిల్ ప్రభుత్వం చెల్లించి జీరో బిల్లులను వారికి అందించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరో రెండు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, 200 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలును ప్రారంభించామని సీతక్క పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నెల 1 నుంచి గృహజ్యోతి పథకంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించిన వారికి సున్నా బిల్లులు ఇస్తున్నారు. 5వ తేదీ వరకు టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 2.5 లక్షలు, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 7.5 లక్షల మంది వినియోగదారులకు జీరో బిల్లులు అందించారు. తెలంగాణ వ్యాప్తంగా తొలి విడతలో 39.9 లక్షల మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ వచ్చేలోపే వీరందరికీ సున్నా బిల్లింగ్‌ పూర్తి చేయాలని భావిస్తుంది. 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించే వారందరికీ మార్చి నెల నుంచే జీరో బిల్లు వస్తుందని ప్రభుత్వం ప్రకటించినా.. చాలా మందికి పాత పద్ధతిలోనే బిల్లు రావడం తో వారంతా మాకెందుకు బిల్లు వచ్చిందని గగ్గోలు పెడుతున్నారు.

అలాంటి వారికి ప్రభుత్వం కీలక సూచనలను తెలియజేస్తుంది. జీరో కరెంట్ బిల్ రాలేదని టెన్షన్ పడాల్సిన పనిలేదని, జీరో బిల్స్ రానివారు మీ తెల్ల రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు, జత చేస్తూ స్థానిక మున్సిపల్/MPDO కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని చెబుతున్నారు.

Read Also : TS Politics : కేటీఆర్‌ అన్నదే జరిగితే.. బీఆర్ఎస్‌కు చావుదెబ్బ తప్పదు..!