BJP Trapped TRS: బీజేపీ ట్రాప్ లో టీఆర్ఎస్, ఎంఐఎం!

హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల విషయంలో అధికార టీఆర్‌ఎస్‌ను బీజేపీ తన ఉచ్చులోకి లాగిందా?

  • Written By:
  • Updated On - September 19, 2022 / 02:54 PM IST

తెలంగాణలో రాజకీయాలు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా మారాయి. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల విషయంలో అధికార టీఆర్‌ఎస్‌ను బీజేపీ తన ఉచ్చులోకి లాగిందా? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను పట్టించుకోని ఎనిమిదేళ్ల రాజకీయ పంథాను టీఆర్‌ఎస్‌ విడనాడాలని బీజేపీ ఒత్తిడి చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుపుకుని, రోజంతా ర్యాలీలు, ఊరేగింపులు, జెండా ఎగురవేతలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా బిజెపి ముందడుగు వేసింది. దీంతో టిఆర్‌ఎస్‌ బీజేపీ డిమాండ్ కు తలొగ్గింది. సెప్టెంబరు 17 సమైక్యతా దినోత్సవం, జాతీయ ఐక్యతా దినోత్సవం అని పిలిచి కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు టీఆర్ఎస్ నేతలు.

ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి టీఆర్‌ఎస్ హాజరవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, బీజేపీ ప్రచార యంత్రాంగానికి తాము లొంగిపోయామని నేతలు కూడా గ్రహించారు. చివరకు MIM కూడా సెలబ్రేషన్స్ చేసుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం తిరంగా ర్యాలీలు నిర్వహించింది. వచ్చే ఏడాది నుంచి హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు వ్యతిరేకత ఉండదని బీజేపీ, సంఘ్ పరివార్ సంతోషిస్తున్నాయి.

హైదరాబాద్‌ విమోచనం కోసం బీజేపీ, సంఘ్‌ పరివార్‌లు ఏడాది పాటు సుదీర్ఘ కార్యక్రమాన్ని చేపట్టాయని వర్గాలు చెబుతున్నాయి. ఏడాది పొడవునా రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు, ర్యాలీలు, ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. వచ్చే ఏడాదికి హైదరాబాద్‌ విమోచనానికి 75 ఏళ్లు పూర్తవుతాయి. మరి బీజేపీని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ ఏం చేస్తుందో చూడాలి.