Site icon HashtagU Telugu

Amit Shah Security Lapse : కేంద్ర హోంమంత్రి షా ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తాలోపం

Amit Shah

Amit Shah

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొని, బేగంపేటలోని హరిత ప్లాజాకు అమిత్ షా తిరిగి వచ్చారు. ఆ స‌మ‌యంలో కాన్వాయ్‌ను బ్రెజ్జా కారు అడ్డుకోవడంతో అప్రమత్తమైన భద్రతా అధికారులు ఆ వాహనం వెనుక అద్దాన్ని పగులగొట్టారు. కాన్వాయ్ కు అడ్డొచ్చిన కారు కొత్త గా ఉంది. టెంప‌ర‌రీ రిజిస్ట్రేష‌న్ స్టిక్క‌ర్ వేసి ఉంది.భద్రతా అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ప్ర‌స్తుతం విచారణ జరుపుతున్నారు. ట్రాఫిక్ పోలీసులపై కూడా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో అమిత్ షా ముంబై పర్యటనలో భద్రతా లోపం బయటపడింది. వైసీపీ ఎంపీ పీఏగా షా కాన్వాయ్ లో ఇటీవ‌ల ఒక వ్య‌క్తి చొర‌బ‌డ్డారు. ఇటీవ‌ల షా కాన్వాయ్ కు భ‌ద్రతాలోపం క‌నిపిస్తోంది.