CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. గురువారం 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచారు. బారీ కేడ్స్ ద్వారా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సీఎం ఇంటి వద్ద భారీగా మోహరించారు. రేవంత్ రెడ్డి నివాసం వైపు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఢిల్లీ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ మరోఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని పెద్దలను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. తెలంగాణ మంత్రివర్గ ఏర్పాటుపై ఢిల్లీ కాంగ్రెస్ నేతలు కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి.. పదవుల కేటాయింపుపై రేవంత్ రెడ్డితో చర్చిస్తున్నారు. చర్చల అనంతరం డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే మంత్రివర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది.దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు ఢిల్లీ హైకమాండ్‌తో లాబీయింగ్‌లు మొదలుపెట్టారు.
Also Read: Lotus In Puja: పూజలో కలువ పువ్వును ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?