Site icon HashtagU Telugu

Secretariat : తెలంగాణ సచివాలయంలో భద్రతా వైఫల్యం

Telangana Secretariat

Telangana Secretariat

తెలంగాణ రాష్ట్ర సచివాలయం(Telangana Secretariat )లో భద్రతా లోపం (Security Flaw) మరోసారి బయటపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు నకిలీ ఉద్యోగులు (Two fake employees) ఆరో ఫ్లోర్ వరకు వెళ్లినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. అధికారిక గుర్తింపు కార్డులు లేకుండా ఫేక్ ఐడీలతో సచివాలయంలోకి ప్రవేశించగలగడం ఇప్పుడు తీవ్ర అంశంగా మారింది. ముఖ్యమంత్రి సమావేశం జరుగుతున్న సమయానికే ఇలా ఫేక్ ఉద్యోగులు ఆ వేదికను చేరడం ఆందోళన కలిగిస్తోంది.

Surya Tilak Of Ramlalla: అయోధ్య‌లో రేపు అద్భుతం.. రామ‌య్య‌కు సూర్య‌తిల‌కం!

ఈ ఘటనపై సచివాలయం అధికారులు లోపంగా భావించినప్పటికీ, పోలీసు సిబ్బంది ఈ విషయాన్ని బయటకు రాకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు సిబ్బంది అంటున్నారు. సెక్యూరిటీ విభాగం గ్యాప్‌ను ఉపయోగించుకొని నకిలీ ఉద్యోగులు హల్చల్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇదే తరహాలో ఇద్దరు ఫేక్ ఐడీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ భద్రతా చర్యలు కఠినంగా అమలు చేయకపోవడం వల్ల మరోసారి ఈ సంఘటన పునరావృతమైంది.

ఇక తాజా ఘటనపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ముఖ్యమంత్రి సమక్షంలో నకిలీ ఉద్యోగుల ప్రవేశం భద్రతాపరమైన సీరియస్ సమస్యగా మారింది. దీనిపై చర్యలు తీసుకోవాలని, సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని మంత్రులు భద్రతా అధికారులకు సూచించినట్లు సమాచారం. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు బయోమెట్రిక్ స్కానింగ్, సీసీ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నాయి.