Site icon HashtagU Telugu

Secunderabad BRS Candidate : సికింద్రాబాద్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్

Scb Brs

Scb Brs

సికింద్రాబాద్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా (Secundrabad BRS MP Candidate ) పద్మారావు గౌడ్ (T Padma Rao Goud) ను ఖరారు చేసారు పార్టీ అధినేత కేసీఆర్ (KCR). నిన్న, మొన్నటి వరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. కానీ సికింద్రాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని నిలిపేందుకు కేసీఆర్ పక్క ప్లాన్ తో పద్మారావు గౌడ్ దింపారు. స్థానిక నేత కావడంతో పాటు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడంతో పద్మారావు గౌడ్ అయితే బాగుంటుందని డిసైడ్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధతకలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ ‘పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన పద్మారావు గౌడ్‌.. 2004లో మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టారు. తెలంగాణ తొలి కేబినెట్‌లో మంత్రిగానూ వ్యవహరించారు.

Read Also : Solar Eclipse 2024: ఏప్రిల్ 8న సూర్యగ్ర‌హణం.. భార‌త్‌లో దీని ప్ర‌భావ‌మెంత‌..?