Indian Spermtech : సికింద్రాబాద్‌లో నడుస్తున్న ఇండియన్ స్పెర్మ్‌టెక్ క్లినిక్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహించిన దాడులు సంచలనానికి దారితీశాయి. క్లినిక్ నిర్వాహకులు అనుమానాస్పదంగా స్పెర్మ్ సేకరణ చేస్తున్నారనే సమాచారంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రారంభ దర్యాప్తులోనే పోలీసులు, ఆరోగ్య అధికారులు ఆశ్చర్యపోయే వివరాలు బయటపెట్టారు.
క్లినిక్ సిబ్బంది యువకులను డబ్బుల ప్రలోభపెట్టడంతో పాటు, పో*ర్న్ వీడియోలు చూపించి స్పెర్మ్ నమూనాలను సేకరిస్తున్నట్లు తేలింది. స్థానికులు, బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా టాస్క్‌ఫోర్స్ అధికారులు అకస్మాత్తుగా దాడులు జరపగా, ఆ సమయానికి అక్కడ ఉన్న పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
Sec-bad Test Tube Baby Center : ఆ వీడియోలు చూపిస్తూ స్పెర్మ్ సేకరణ
దాడుల అనంతరం ఆరోగ్య శాఖ అధికారులు క్లినిక్‌ను పూర్తిగా తనిఖీ చేసి 16 స్పెర్మ్ నమూనాలను సీజ్ చేశారు. ఈ స్పెర్మ్‌ను సరోగసి కోసం వినియోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లినిక్ నిర్వాహకులు ఈ ప్రక్రియను చట్టబద్ధమైన వైద్యసేవ పేరుతో నిర్వహిస్తూ యువకుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్పెర్మ్‌టెక్ క్లినిక్‌కు, నగరంలో పేరుగాంచిన “సృష్టి టెస్ట్‌ట్యూబ్ సెంటర్” లేదా ఇతర ఫెర్టిలిటీ సెంటర్లకు ఎటువంటి సంబంధం ఉందో తెలుసుకునేందుకు విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే క్లినిక్‌లో ఉన్న రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు స్వాధీనం చేసుకున్నారు.
సరోగసి పేరుతో జరుగుతున్న అనైతిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో నిర్వాకంతో పోలీసులు అన్ని ఫర్టిలిటీ సెంటర్లపై ఆకస్మీక దాడులు నిర్వహించి తనిఖీలు చేబడుతున్నారు.
CID Searches at Bharti Cements : భారతి సిమెంట్స్‌పై సీఐడీ సోదాలు.. లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు