సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం సాయన్న తుది శ్వాస విడిచారు.
Also Read: Sanjay Raut: శివసేన పేరు, గుర్తు కోసం రూ. 2000 కోట్లు ఖర్చు.. ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ MLA సాయన్న (72) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నెల 16 న ఆయన గుండెనొప్పితో యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఎమ్మెల్యే సాయన్న ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. 1951 మార్చి 5న ఆయన జన్మించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా సాయన్న గెలిచారు. సాయన్న 2014, 2018 ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.