Site icon HashtagU Telugu

TS Police : సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 144 సెక్ష‌న్‌.. మోడీ ప‌ర్య‌ట‌న‌కు భారీ భ‌ద్ర‌త‌

Police

Police

హైదరాబాద్: జూలై 2, 3 తేదీల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశానికి ప్ర‌ధాని మోడీ, హోంమ‌త్రి అమిత్‌షా హాజ‌రుకానున్నారు. అయితే మోడీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో సైబరాబాద్క మిషనరేట్ ప‌రిధిలో 144 సెక్ష‌న్ విధిస్తున్న‌ట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్  స్టీఫెన్ ర‌వీంద్ర తెలిపారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకుడ‌ద‌ని.. శాంతిభ‌ద్ర‌త‌ల దృష్ట్యా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఉత్తర్వులు 1 జూలై, 2022 నుండి 7వ తేదీ వరకు అమలులో ఉంటాయి. బీజేపీ సభకు వేదికైన గచ్చిబౌలిలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌లు ఎగురవేయడాన్ని నిషేధిస్తూ గతంలో పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆర్డర్ జూన్ 30 ఉదయం 6 గంటల నుండి జూలై 4 సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటుంది.