Amit Shah – Secret Operation : తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో అమిత్ షా ‘సీక్రెట్’ ఆపరేషన్!

Amit Shah - Secret Operation : తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేత,   కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యూహరచన చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 17, 2024 / 09:41 AM IST

Amit Shah – Secret Operation : తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేత,   కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యూహరచన చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన కొన్ని బృందాలను తెలంగాణకు పంపించారు. వీటిలో కొన్ని టీమ్స్ నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలోనే ఉండగా, మరికొన్ని వివిధ లోక్‌సభ స్థానాల పరిధిలో అభ్యర్థుల ప్రచారం తీరుపై స్టడీ చేస్తున్నాయి. ప్రచారంలో అభ్యర్థులకు పార్టీ నుంచి లభిస్తున్న సహకారం, రాష్ట్ర నాయకత్వం నుంచి లభిస్తున్న మద్దతు వంటి అంశాలపై ఈ టీమ్స్ సమాచారాన్ని సేకరించి నివేదికలను నేరుగా అమిత్ షాకు పంపుతున్నాయని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

ఈ టీమ్స్  నుంచి అమిత్ షాకు(Amit Shah – Secret Operation) పంపుతున్న నివేదికల్లో ఏముందనే వివరాలను రాష్ట్ర బీజేపీ లీడర్లకు కూడా తెలియకుండా జాగ్రత్త పడుతుండటం గమనార్హం. ఈ రహస్య నివేదికల ఆధారంగా ఆయా స్థానాల్లో బీజేపీని మరింతగా జనంలోకి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్‌షా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీపై రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఇమేజ్, మోడీపై ఉన్న అభిమానం, కొత్త మేనిఫెస్టోలో ఉన్న జనాకర్షక అంశాలతో ఎన్నికల్లో అడ్వాంటేజ్ పొందేలా వ్యూహ రచన జరుగుతున్నట్లు చెబుతున్నారు. లోక్‌సభ స్థానాల్లో గెలుపునకు ఉపయోగపడే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని.. కాంగ్రెస్‌నే ప్రధాన ప్రత్యర్థిగా పరిగణించి ముందుకు వెళ్లాలనే సందేశం కేంద్ర నాయకత్వం నుంచి బీజేపీ అభ్యర్థులకు అందుతోందని అంటున్నారు.

Also Read :Kishan Reddy Vs MIM – Congress : కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఓడించేందుకు సీఎం రేవంత్ బిగ్ స్కెచ్!

చాలాచోట్ల బీజేపీ  అభ్యర్థులు మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారని, కొన్నిచోట్ల మాత్రమే అభ్యర్థులు చొరవ తీసు కుంటున్నారని అమిత్ షాకు నివేదిక వెళ్లిందని తెలిసింది. పలు చోట్ల అభ్యర్థులకు రాష్ట్ర నాయకుల నుంచి సహకారం అందడం లేదని,  పార్టీ క్యాడర్ కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆ రిపోర్టులో ప్రస్తావించారట. అది అందిన తర్వాతే.. ముందుజాగ్రత్త చర్యగా ప్రత్యేక టీమ్స్‌ను తెలంగాణకు అమిత్ షా పంపారట. పోలింగ్ పూర్తయ్యే వరకు అమిత్ షా పంపిన టీమ్‌లు రాష్ట్రంలోనే ఉండనున్నాయి. మే నెల మొదటి వారం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వివిధ రాష్ట్రాల సీఎంలతో పాటు  అమిత్ షా తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మరో వైపు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని సర్వే రిపోర్టులు వస్తున్నాయి. వీటిని కూడా పాజిటివ్‌గా తీసుకొని, అదనపు బలంగా మలుచుకొని పట్టుదలతో శ్రమిస్తే విజయం తప్పక వరిస్తుందని అమిత్ షా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు పదేపదే చెబుతున్నారు. షా వ్యూహచరన ఎంతమేరకు ఫలిస్తుందో.. ఎన్నికల ఫలితాలు విడుదలైతే తెలిసిపోతుంది.

Also Read :Thota Trimurthulu – YSRCP: తోట త్రిమూర్తులుకు సీటు ఇస్తారా ? వేటు వేస్తారా ?