Secret Camera: అమ్మాయిల రూముల్లో సీక్రెట్ కెమెరా, నగ్న దృశ్యాలు రికార్డ్.. చివరకు ఏమైందంటే!

పోలీసులు హెచ్చరిస్తున్నా.. సీసీ కెమెరాల వాడకంపై అవగాహన కల్పిస్తున్న అమ్మాయిలు సీక్రెట్ కెమెరాల బారిన పడుతూనే ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Woman crime

Woman crime

పోలీసులు హెచ్చరిస్తున్నా.. సీసీ కెమెరాల వాడకంపై అవగాహన కల్పిస్తున్న అమ్మాయిలు సీక్రెట్ కెమెరాల బారిన పడుతూనే ఉన్నారు. రహస్యంగా కెమెరాలు పెట్టడం, నగ్న ద్రుశ్యాలను రికార్డ్ చేసి అమ్ముకోవడం కొందరికి అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని యువతులు ఉండే రూమ్‌లోనే రహస్య కెమెరాను అమర్చాడు ఇంటి ఓనర్. దానిని తన కంప్యూటర్‌కు అనుసంధానం చేసుకొని.. వీడియోలు చూస్తూ పైశాచిక ఆనందం పొందాడు. చివరికి ఆ యువతులు కెమెరాను గుర్తించి పోలీసులకు చెప్పడంతో కటకటాల పాలయ్యాడు.

అస్సాంకు చెందిన ఓ యువతి తన సోదరుడు.. మరో యువతితో కలిసి హైలమ్ కాలనీలోని ఓ ఇంటిలో అద్దెకు దిగారు. రెండు నెలలుగా ఆ ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. అయితే వారు అద్దెకు దిగినప్పటి నుంచి ఇంటి యాజమాని సమీర్‌ రహస్యంగా గమనిస్తున్నాడు. ఈక్రమంలో యువతులు ఉండే రూమ్‌లో కరెంట్ మీటర్ అని చెప్పి ఓ బాక్సును అమర్చాడు. దానిలో రహస్యంగా ఓ కెమెరాను పెట్టాడు. దానిని తన కంప్యూటర్‌కు, ఫోన్‌కు అనుసంధానం చేసుకున్నాడు. అలా యువతులు బట్టలు మార్చుకునే దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ వీడియోలను చూస్తూ ఆనందించేవాడు.

అయితే ఇటీవల బాక్సులో నుంచి బీప్ అనే శబ్దం రావడంతో యువతికి అనుమానం కలిగి దానిని ఓపెన్ చేసి చూసింది. అందులో కెమెరా ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అద్దె గదులు, లాడ్జీలు, కొత్త ప్రదేశాల్లోకి వెళ్లేముందే అమ్మాయిలు ఇంటి పరిసరాలను పూర్తిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. రహస్య కెమెరాలను గుర్తించేందుకు అధునాతన టెక్నాలజీని వాడుకోవాలని చెబుతున్నారు.

Also Read: Sreeleela beats Rashmika: రష్మికకు శ్రీలీల ఝలక్.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ!

  Last Updated: 12 Jul 2023, 03:28 PM IST