బీఆర్ఎస్ (BRS) నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే(LB Nagar MLA) సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST Atrocity Case) నమోదైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎల్బీనగర్ పోలీసులు ఆయనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 కింద క్రైమ్ నంబర్ 254/2025తో కేసు నమోదు చేశారు. ఈ వివాదం ప్రోటోకాల్ సమస్య దగ్గర ప్రారంభమైంది. మార్చి 12న మన్సూరాబాద్ డివిజన్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే, ఈ కార్యక్రమాన్ని బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి తిరిగి శంకుస్థాపన చేయడం వల్ల వివాదం రేగింది.
What Is Autopen : ఏమిటీ ఆటోపెన్ ? బైడెన్ ఏం చేశారు ? నిప్పులు చెరిగిన ట్రంప్
ఈ సంఘటన తర్వాత బీఆర్‌ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే డివిజన్‌లో మరో అభివృద్ధి కార్యక్రమానికి మళ్లీ శంకుస్థాపన చేసే ప్రయత్నాన్ని వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి నిరసన తెలియజేశారు, దాంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టు సమయంలో పలువురు కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. వారిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఆయన హస్తినాపురం కార్పొరేటర్‌కి మద్దతుగా ఉన్నారని ఆరోపించారు.
Junaid Khan: తీవ్ర విషాదం.. ఎండ కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్ మృతి
ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ తీవ్రంగా ఖండించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో ఎల్బీనగర్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో, సుధీర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు ఉంటాయో అన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.