Trains Cancelled: వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది.

  • Written By:
  • Updated On - July 14, 2022 / 03:43 PM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు జూలై 14 నుండి జూలై 17 వరకు 15 రైళ్లు రద్దయ్యాయి.  వాటిలో సికింద్రాబాద్ – ఉమ్దానగర్ – సికింద్రాబాద్ ప్యాసింజర్ స్పెషల్, సికింద్రాబాద్ – ఉమ్దానగర్ మెము స్పెషల్, మేడ్చల్ – ఉమ్దానగర్ – మెము స్పెషల్, ఉమ్దానగర్ – సికింద్రాబాద్, హెచ్. ఎస్. నాందేడ్ – మేడ్చల్ – హెచ్. ఎస్. నాందేడ్ ప్యాసింజర్ స్పెషల్, సికింద్రాబాద్ – మేడ్చల్ – మెము – సెకందరాబాద్ స్పెషల్, బొలారం – మెము స్పెషల్, బోలారం – సికింద్రాబాద్ – మెము స్పెషల్, సికింద్రాబాద్ – మేడ్చల్ స్పెషల్, కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ మార్గాల మధ్య నడిచే రైళ్లు రద్దయ్యాయి.

కాకినాడ పోర్ట్ – విజయవాడ MEMU కాకినాడ పోర్ట్, రాజమండ్రి మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది. వర్షాల దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్‌లోని MMTS జూలై 17 వరకు రద్దయిన విషయం తెలిసిందే. మొత్తం 34 రోజువారీ సర్వీసులు నిలిచిపోాయాయి. లింగంపల్లి – హైదరాబాద్ మధ్య మొత్తం తొమ్మిది సర్వీసులు, హైదరాబాద్ – లింగంపల్లి మధ్య తొమ్మిది సర్వీసులను రద్దు చేశారు. అలాగే ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య ఏడు సర్వీసులను, లింగంపల్లి – ఫలక్‌నుమా మధ్య ఏడు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. సికింద్రాబాద్‌ – లింగంపల్లి మధ్య ఒక సర్వీసు, సికింద్రాబాద్‌ – లింగంపల్లి మధ్య ఒక సర్వీసు కూడా రద్దు చేశారు. సబర్బన్ రైళ్లు ఇంట్రా – సిటీ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.