Site icon HashtagU Telugu

Telangana Govt Schools : తెలంగాణ ప్రభుత్వ స్కూల్ టైమింగ్స్ లలో మార్పులు

Heavy Rains In AP

Heavy Rains In AP

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి ప్రభుత్వ పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9.30 గంటలకు తెరుచుకుంటుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి అరగంట ముందుగానే, అంటే ఉదయం 9 గంటలకే ప్రారభించాలని నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యాసంవత్సరం వరకు ఆ పాఠశాలలు ఉదయం 9:00 గంటలకే తెరుచుకునేవి. గత విద్యాసంవత్సరం(2023-24)లో 9.30 గంటలకు ప్రారంభమయ్యేలా మార్చారు. అయితే, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు ఉదయం 8:00 గంటలకే బస్సులెక్కి వెళ్లిపోతుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉదయం 9:30 గంటలకు వెళ్లడం వల్ల సర్కార్ బడులపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతుందని విద్యాశాఖ అధికారులు ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9:00 గంటలకే ప్రారంభించాలన్న ప్రతిపాదనకు బుర్రా వెంకటేశం ఆమోదం తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఆరు, ఏడు తరగతుల గణితం సబ్జెక్టును ఇక నుంచి భౌతికశాస్త్రం ఉపాధ్యాయులే బోధించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ రెండు తరగతులకు గణితం టీచర్లు బోధిస్తే వారిపై పనిభారం పెరుగుతుందని భావించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రప్రభుత్వం క్యాలెండర్ ను సైతం విడుదల చేసింది. ఈ సంవత్సరం జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభమై వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని తెలిపింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉంటాయని , డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజులు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నట్టు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. వచ్చే సంవత్సరం జనవరి 13 నుంచి నుంచి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28లోపు పదో తరగతి విద్యార్థులకు ప్రీ-ఫైనల్‌ పరీక్షలు పూర్తిచేయనున్నట్టు వివరించింది. మార్చిలో పదోతరగతి పరీక్షలు ఉంటాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది.

Read Also : Balakrishna : సీఎం రేవంత్ ను కలిసిన నందమూరి బాలకృష్ణ