Site icon HashtagU Telugu

School Teacher : పాఠశాలలో పాఠాలు చెప్పాల్సిన బడిపంతులు..ఫుల్ గా మద్యం కొట్టి వచ్చాడు

School Teacher

School Teacher

ఒకప్పుడు బడిపంతులు అంటే ఆ గౌరవమే వేరే లెవల్లో ఉండేది..పాఠశాలలో కేవలం పాఠాలు చెప్పడమే కాదు సమాజంలో ఎలా ఉండాలి..ఎలా ఉండకూడదు..పెద్దలను ఏ విధంగా గౌరవించాలి..వంటి ఎన్నో మంచి బుద్దులు నేర్పించేవారు. కానీ ఇప్పుడు అవేమి లేదు..మంచి బుద్దులు చెప్పాల్సిన పంతుళ్లే బయటకు చెప్పలేని విధంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులతోనే కామ కోర్కెలు తీర్చుకునే లేడి ఉపాధ్యాయులు కొంతమంది ఉంటె..కొంతమంది విద్యార్థునులఫై లైంగిక దాడికి పాల్పడే ఉపాధ్యాయులు మరికొంతమంది..ఇంకొంతమంది ఫుల్ గా మద్యం సేవించి పాఠశాలలో నానా రభస చేసే వారు. ఇలా ఉపాధ్యాయులు అనే పదానికే అర్ధం మారుస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఉపాద్యాయుడు ఫుల్ గా మద్యం సేవించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ రాజీవ్‌నగర్‌ కాలనీ ప్రాథమిక పాఠశాలలో రెండేళ్లుగా ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య.. తరచూ మద్యం తాగి విధులకు హాజరవుతుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కూడా పూటుగా మద్యం తాగి నడవలేని స్థితిలో పాఠశాల వద్దకు వచ్చాడు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న ఆయన కనీసం నడిచే శక్తి లేని స్థితిలో ఉండి పాఠశాల బయటే పడిపోయాడు. ఈయన్ను గమనించిన స్థానికులు కొద్దిసేపటి తరువాత వచ్చారు. స్పృహలో లేని అతడిని పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి తీసుకెళ్లి చాప మీద పడుకోబెట్టారు. కాగా, రెండేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న ఇతడు తరచూ ఇలాగే మద్యం తాగి విధులకు హాజరవుతున్నట్లు స్థానికులు చెప్పారు. గతంలో అనేకసార్లు తాము ఇతడి విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. వారు అతడిని మందలించినప్పటికీ అతడిలో మార్పు రావడం లేదని వాపోయారు. ఈసారైనా ఇతడి ఫై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read Also :