Site icon HashtagU Telugu

TS : తెలంగాణలో దసరా సెలవులు కుదింపు..?

Students

Students

తెలంగాణలో దసరా సెలవులను 14 రోజుల నుంచి తొమ్మిది రోజులకు తగ్గించాలని SCERTడైరెక్ట్ ఎం రాధారెడ్డి విద్యాశాఖ డైరెక్టర్ కు లేఖ రాశారు. దసరా కోసం రాష్ట్ర సర్కార్ ముందుగా సెప్టెంబర్ 26 వ తేదీ నుంచి అక్టోబర్ 9 వ తేదీ 14 రోజులు సెలవులు ప్రకటించింది. అయితే ఆగస్టులో కురిసిన వర్షాలు, ఈ నెలలో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవం కారణంగా విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు వచ్చాయి. ఆ సెలవులను భర్తీ చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని పాఠశాలలు పనిచేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 14రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చుకోవచ్చు….కానీ ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ , 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చి , ఏప్రిల్ కు సంబంధించి రెండో శనివారాల్లో సెలవులు రద్దు చేసుకోవల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.

అయితే SCERT రాధారెడ్డి లేఖపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ ఇప్పటికే 14రోజుల సెలవులు ప్రకటించడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు రైళ్లు, బస్సులు బుకింగ్ చేసుకున్నామని…ఇప్పుడు సెలవులు మారుస్తే ఎలాంటు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి దసరా సెలవుల విషయంలో గందరగోళం నెలకొంది.

 

Exit mobile version