Site icon HashtagU Telugu

SCCL: సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్/ నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌ పోస్టులు

Sccl.. 272 Executive..non Executive Cadre Posts In Singareni

Sccl.. 272 Executive..non Executive Cadre Posts In Singareni

 

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌/ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో 272 ఖాళీలు భర్తీ కానున్నాయి. మార్చి 1 నుంచి 18లోపు దరఖాస్తు చేసుకోవాలి.

We’re now on WhatsApp. Click to Join.

ప్రకటన వివరాలు:

I. ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్), ఈ2 గ్రేడ్: 139 పోస్టులు
2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఎ), ఈ2 గ్రేడ్: 22 పోస్టులు
3. మేనేజ్‌మెంట్ ట్రైనీ (పర్సనల్), ఈ2 గ్రేడ్: 22 పోస్టులు
4. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఐఈ), ఈ2 గ్రేడ్: 10 పోస్టులు
5. జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్: 10 పోస్టులు

6. మేనేజ్‌మెంట్ ట్రైనీ (హైడ్రో-జియాలజిస్ట్), ఈ2 గ్రేడ్: 02 పోస్టులు
7. మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్), ఈ2 గ్రేడ్: 18 పోస్టులు
8. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్: 03 పోస్టులు
9. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఈ3 గ్రేడ్: 30 పోస్టులు
II. నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
10. సబ్-ఓవర్సీర్ ట్రైనీ (సివిల్), టి & ఎస్‌ గ్రేడ్-సి: 16 పోస్టులు

వయస్సు: గరిష్ఠంగా 30 ఏళ్లు మించకూడదు. జీడీఎంవో పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

read also : Telangana: ఏజెన్సీలను అలర్ట్ చేసిన తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి

గమనిక: నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు మార్చి 1న వెలువడనున్నాయి.

ముఖ్య తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభం: 01-03-2024.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 18-03-2024.

https://chat.whatsapp.com/C5SRpTE8Tcd0kMJopkYiNG