Site icon HashtagU Telugu

SC Categorization : ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం

Manda Krishna Madiga

Manda Krishna Madiga

SC Categorization : సుప్రీంకోర్టు 2024లో ఎస్సీ (సమాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలు), ఎస్టీ (ఆదివాసీ) వర్గీకరణపై కీలక తీర్పును ఇచ్చింది. ఈ తీర్పులో, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ , ఎస్టీ కులాలలో ఉపవర్గీకరణ (sub-classification) చేయడానికి అనుమతి ఇచ్చింది. దీని ద్వారా, రిజర్వేషన్ విధానంలో కొన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యమవుతుంది. అయితే, ఈ ప్రక్రియలో ఆర్టికల్ 341 (ఎస్సీ) , ఆర్టికల్ 342 (ఎస్టీ) ప్రకారం, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ అనుమతితో మాత్రమే ఈ ఉపవర్గీకరణను అమలు చేయవచ్చు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఉస్మానియా యూనివర్సిటీ లో ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

Tejashwi Yadav: ఇండియా కూటమిపై తేజస్వీ యాదవ్‌ వివాదస్పద వ్యాఖ్యలు

ఎస్సీ వర్గీకరణను అమలును కోరుతూ ఫిబ్రవరి 7న నిర్వహించబోయే “వేల గొంతులు లక్షల డప్పులు దండోరా” మహా ప్రదర్శనను విజయవంతం చేయడానికి విద్యార్థి సంఘాల మద్దతును కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. నలిగంటి శరత్ అధ్యక్షత వహించిన ఈ సమావేశాన్ని ఓయూ విద్యార్థి నేతలు దరువు ఎల్లన్న నలిగింటి శరత్‌లు సమన్వయం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ప్రపంచమే ఔరా.. అనేస్థాయిలో లక్ష డప్పుల మహా ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు. మాదిగల కల డప్పు కొట్టడమని.. ఆ డప్పు కొట్టడంలోనే మన కళ దాగి ఉందన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగన్న, ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ బీసీ నేతలు దరువు అంజన్న మైనార్టీ నేత ఇస్మాయిల్ ప్రముఖ రచయిత మిట్టపల్లి సురేందర్ తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాకు గుడిపల్లి రవి పున్న కైలాసనేత పాల్గొన్నారు.

వీరితో పాటు.. డిజిటల్ మీడియా ఇంచార్జ్ సోమారపు మురళీకృష్ణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ , వివిధ విద్యార్థి సంఘాల నేతలు , ఎంఎస్ఎఫ్ జాతీయ రాష్ట్ర నేతలు సోమశేఖర్ మాదిగ , డాక్టర్ పల్లెర్ల సుధాకర్ మాదిగ సందే కార్తీక్ మాదిగ కొమ్ము శేఖర్ మాదిగ తోకల చిరంజీవి మాదిగ బైరపోగు శివకుమార్ మాదిగ మహేష్ మాదిగ మంద రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Kuber Vastu: ఈ దిక్కులో కుబేరుడిని ఉంచితే డబ్బే డ‌బ్బు!