Telangana: పని ఒత్తిడి కారణంగా బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వాంకిడి మండలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్న బానోత్ సురేష్ (35) పురుగుమందు తాగి ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రకారం సురేష్ పని ఒత్తిడి కారణంగా కొన్నాళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నాడని చెప్పారు. ఆ కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు చెప్తున్నారు.
సురేష్ పని చేసే కార్యాలయంలో పురుగుమందుతగినట్టు పాథమిక సమాచారం. ఆగస్టు 17న వాంతులు చేసుకోవడంతో సిబ్బంది అతడిని ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసిఫాబాద్‌లో ఉంటున్న కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆగస్టు 20న తుదిశ్వాస విడిచారు. సురేష్‌కు భార్య ప్రియాంక, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. సురేష్ మరణంపై భార్య వాంగ్మూలం ఇచ్చింది. పని ఒత్తిడి కారణంగా తన భర్త ఒత్తిడికి గురవుతున్నాడని ప్రియాంక తెలిపింది. ఇద్దరు వ్యక్తులు చేయాల్సిన పనిని తన భర్త ఒక్కడే చేస్తున్నారని, దాంతో ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె తెలిపారు. చింతగూడ గ్రామానికి చెందిన సురేష్ ఏడాది క్రితం వాంకిడి బ్రాంచ్‌కు మేనేజర్‌గా బదిలీ అయ్యారు. సురేష్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Mahesh Babu: ఫ్యామిలీతో టూర్లకెళ్లడం తప్పా.. ట్రోల్స్ పై మహేశ్ రియాక్షన్